1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారు తమ ఆధార్ నెంబర్ను (Aadhaar Number) లింక్ చేయడం తప్పనిసరి. ఈపీఎఫ్ అకౌంట్, ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి 2021 జూన్ 1 గడువు అని గతంలోనే ప్రకటించింది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్-EPFO. కానీ యాజమాన్యాలు ఉద్యోగుల పీఎఫ్ జమ చేయడంలో ఇబ్బందులు రావడంతో ఈ గడువును 2021 సెప్టెంబర్ 1 వరకు పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంటే సెప్టెంబర్ 1 లోగా ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తప్పనిసరిగా తమ ఆధార్ నెంబర్ లింక్ (Aadhaar Number Linking) చేయాల్సిందే. ఉద్యోగులు తమ ఆధార్ నెంబర్ను ఈపీఎఫ్ అకౌంట్కు లింక్ చేసేలా యాజమాన్యాలు అప్రమత్తం చేయాలని ఈపీఎఫ్ఓ కోరుతోంది. సెప్టెంబర్ డెడ్లైన్ లోగా లింకింగ్ ప్రాసెస్ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఈపీఎఫ్ అకౌంట్లకు ఆధార్ సీడింగ్ తప్పనిసరి చేసింది ఈపీఎఫ్ఓ. గతేడాది పార్లమెంట్లో ఆమోదం పొందిన సోషల్ సెక్యూరిటీ కోడ్ ప్రకారం ఈపీఎఫ్ లబ్ధిదారుల ఆధార్ నెంబర్లు కోరింది కేంద్ర కార్మిక శాఖ. దీంతో ఈపీఎఫ్ఓ ఆధార్ నెంబర్ల లింకింగ్ తప్పనిసరి చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పటికే తమ ఆధార్ నెంబర్లను ఈపీఎఫ్ అకౌంట్లకు లింక్ చేసినవారు మళ్లీ లింక్ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ఆధార్ నెంబర్లు లింక్ చేయనివారు మాత్రమే సెప్టెంబర్ 1 లోగా ఈపీఎఫ్ అకౌంట్లకు ఆధార్ నెంబర్ లింక్ చేయాలి. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్లు తమ ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)