1. కెరీర్లో గ్రోత్ కోసం ఉద్యోగాలు మారడం ఎవరికైనా అవసరమే. ఏడాదికో రెండేళ్లకో ఓసారి జాబ్ మారుతుంటూ ఉంటారు. చేరిన ప్రతీ సంస్థలో ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం, మరో కంపెనీకి మారగానే అక్కడ కూడా ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఉద్యోగులకు అలవాటే. ఇలా ప్రతీ కంపెనీలో ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ అవుతూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. తమ పాత ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన డబ్బుల గురించి పెద్దగా పట్టించుకోరు. దీనివల్ల నష్టపోతూ ఉంటారు. అందుకే ఒకే యూఏఎన్ నెంబర్లపై ఈపీఎఫ్ అకౌంట్ కొనసాగించే అవకాశం కల్పిస్తోంది కంపెనీ. అంటే మీరు ఎన్ని కంపెనీలు మారినా ఒకే యూఏఎన్ నెంబర్లలో వేర్వేరు పాస్‌బుక్స్ ఉంటాయి. వేర్వేరు కంపెనీల్లో జమ చేసిన మొత్తాన్ని కూడా మెర్జ్ చేసి ఒకే పాస్‌బుక్‌లో చేర్చొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇందుకోసం ఈపీఎఫ్ అకౌంట్లను మెర్జ్ చేయాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్స్ మెర్జ్ చేయకుండా పాత అకౌంట్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేస్తూ ఉంటారు. అయితే ఉద్యోగం మారిన తర్వాత పాత అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయాలంటే కొన్ని విషయాలు గుర్తించుకోవాలి. పాత కంపెనీ తప్పనిసరిగా మీ ఈపీఎఫ్ అకౌంట్లో ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కానీ ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతాదారులు తామే స్వయంగా జాయినింగ్ డేట్, ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయొచ్చు. ఉద్యోగి తాము జాబ్ మానేసిన రోజునే డేట్ ఆఫ్ ఎగ్జిట్‌గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎంటర్ చేయొచ్చు. మరి ఈపీఎఫ్ అకౌంట్లో డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎలా ఎంటర్ చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసేముందు ఓ విషయం గుర్తుంచుకోవాలి. ఒకసారి ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసిన తర్వాత ఎడిట్ చేసే అవకాశం ఉండదు. మీరు ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేయాలంటే ఉద్యోగం మానేసిన రెండు నెలల వరకు వేచి ఉండాలి. యజమాని చివరి కంట్రిబ్యూషన్ జమ అయిన రెండు నెలల తర్వాతే ఎగ్జిట్ డేట్ ఎంటర్ చేసే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)