1. ఈపీఎఫ్ అకౌంట్లో జమ చేసిన మొత్తానికి రావాల్సిన వడ్డీ కోసం ఎదురుచూస్తున్న ఈపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేస్తోంది. సుమారు 6.5 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు ఈపీఎఫ్ వడ్డీ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈపీఎఫ్ఓ 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.1 శాతం వడ్డీని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక శాఖ ఈ ఏడాది జూన్‌లో 8.1 శాతం వడ్డీకి ఆమోదముద్రవేసింది. సాధారణంగా కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదముద్ర వేసిన తర్వాత ఈపీఎఫ్ఓ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ చేయడం ప్రారంభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. జూన్‌లో ఆమోదముద్రపడ్డా అక్టోబర్ వరకు వడ్డీ జమ కాకపోవంతో ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఆందోళన నెలకొంది. దీనిపై పలువురు ఆర్థిక శాఖను ట్విట్టర్ ద్వారా సంప్రదించారు. స్పందించిన ఆర్థిక శాఖ ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ జమ అవుతోందని, ఒకవేళ వడ్డీ ఖాతాదారుల స్టేట్మెంట్లో కనిపించకపోతే అందుకు సాఫ్ట్వేర్ అప్‌గ్రేడేషన్ కారణమని క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈపీఎఫ్ఓ సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తున్నందున ఖాతాదారుల అకౌంట్లలో వడ్డీ కనిపించట్లేదని ఆర్థిక శాఖ తెలిపింది. ఏ ఒక్క సబ్‌స్క్రైబర్ వడ్డీ నష్ట పోవట్లేదని, వారి అకౌంట్లలో వడ్డీ జమ అవుతుందని, సెటిల్మెంట్ కోరుకునే అవుట్గోయింగ్ సబ్స్క్రైబర్లందరికీ, విత్‌డ్రాయల్ చేస్తున్నవారికి వడ్డీతో సహా చెల్లింపులు జరుగుతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. తాజాగా ఈపీఎఫ్ఓ వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. ఈపీఎఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ అవుతోంది. ఈ ప్రక్రియ నెలాఖరులోగా పూర్తవుతుంది. కోట్లాదిమంది ఈపీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు కాబట్టి వారి అకౌంట్లలో దశలవారీగా వడ్డీ జమ అవుతుంది. మరి ఈపీఎఫ్ అకౌంట్లో వడ్డీ జమ అయిందో లేదో ఈ స్టెప్స్ ద్వారా తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి ముందుగా epfindia.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో e-Passbook పైన క్లిక్ చేయాలి. కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. యూఏఎన్ నెంబర్, క్యాప్చా కోడ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. లాగిన్ చేసిన తర్వాత పాస్‌బుక్ కనిపిస్తుంది. పాస్‌బుక్ డౌన్లోడ్ చేస్తే అందులో వడ్డీ జమ అయిందో లేదో కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఉమాంగ్ యాప్‌లో ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో UMANG యాప్ డౌన్లోడ్ చేయాలి. మీ ఆధార్ నెంబర్, ఇతర వివరాలతో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత EPFO సెక్షన్ ఓపెన్ చేయాలి. Employee Centric Services పైన క్లిక్ చేయాలి. View Passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. మీ యూఏఎన్ నెంబర్ టైప్ చేసి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు వచ్చే ఓటీపీ ఎంటర్ చేయాలి. స్క్రీన్ పైన పాస్‌బుక్ కనిపిస్తుంది. డౌన్లోడ్ చేసి అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి మరిన్ని పద్ధతులు ఉన్నాయి. ఎస్ఎంఎస్ ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడానికి EPFOHO UAN అని టైప్ చేసి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. యూఏఎన్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్ నుంచి 011-22901406 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చినా ఓవరాల్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ రూపంలో వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)