1. క్రెడిట్ కార్డు చేతిలో ఉంది కదా అని అనేక మంది ఏది కనపడితే అది కొనేస్తూ ఉంటారు. మనకు వచ్చే జీతం ఎంతా? ఇతర ఖర్చులు ఉన్నాయా? ఈ వస్తువు అవసరమా? కాదా? అన్న విషయాలేమీ ఆలోచించకుండా కొంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల చివరికి క్రెడిట్ కార్డు బిల్లు కట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది. కొనే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. క్రెడట్ కార్డు ద్వారా బిల్లు కట్టినా.. అది అప్పేనన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)
2.కొంత మంది క్రెడిట్ కార్డు ద్వారా నగదును కూడా తీసుకుంటారు. ఇలా చేస్తే మీరు బ్యాంకులకు దాదాపు 48 శాతం వరకు భారీ వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్రెడిట్ కార్డు నుంచి నగదు తీసుకునే ముందే ప్రత్యామ్నాయ మార్గాలను వెతకడం చాలా మంచిది. ఇందుకు బదులుగా తెలిసిన వారి నుంచి అప్పుగా తీసుకోవడం చాలా ఉత్తమం.(ప్రతీకాత్మక చిత్రం)
4. అనేక మంది డబ్బులు ఉన్నా కూడా బిల్లులు కట్టడం మర్చిపోతూ ఉంటారు. ఆయా బ్యాంకుల నుంచి ఫోన్, మెసేజ్ లు వచ్చిన తర్వాత హడావుడిగా బిల్లులు కడుతుంటారు. అయితే ఇలా చేయడం ద్వారా మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. అనవసరంగా వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్య రాకుండా గడువుకు రెండు మూడు రోజుల ముందే బిల్లు చెల్లించడం మేలు. లేక పోతే స్మార్ట్ ఫోన్లలో అలారం లేదా రిమైండర్ సెట్ చేసుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)
8. కొంత మంది ఒకటికి మించి క్రెడిట్ కార్డులు వాడుతూ ఉంటారు. అలాంటి వారికి ఏ కార్డులో ఎంత డబ్బులు వాడుకున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. ఒకటికి మించి ఎక్కువ కార్డులు వాడే బదులుగా ఉన్న కార్డుల లిమిట్ పెంచుకోవడానికి బ్యాంకులను సంప్రదించడం మేలు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒకటికి మించి క్రెడిట్ కార్డు వాడినా.. ఎప్పటికప్పుడు అందులోని బ్యాలెన్స్ ను, ట్రాన్సాక్షన్స్ ను తనిఖీ చేసుకోవడం మంచిది.(ప్రతీకాత్మక చిత్రం)