1. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నారా? మీ క్రెడిట్ కార్డు బిల్లు వాయిదా వేయాలనుకుంటున్నారా? అయితే మోసపోతారు జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. క్రెడిట్ కార్డు హోల్డర్లకు మోసగాళ్లు ఫోన్ చేసి క్రెడిట్ కార్డు బిల్లు వాయిదా వేస్తామని నమ్మించి దోచేస్తున్నారని ఎస్బీఐ గుర్తించింది. కస్టమర్లకు సైబర్ నేరగాళ్లు ఫోన్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. మీ క్రెడిట్ కార్డు బిల్లు వాయిదా వేయాలంటే పేరు, ఆధార్ నెంబర్, అడ్రస్ లాంటివి చెప్పాలని కస్టమర్లను అడుగుతున్నారు. ఆ వివరాలు చెప్పిన తర్వాత నియమనిబంధనలన్నీ వెల్లడిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఆ తర్వాత కార్డు నెంబర్, సీవీవీ తెలుసుకొని ఆ వివరాలతో ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. ఓటీపీ తెలుసుకొని పేమెంట్ పూర్తి చేస్తున్నారు. కస్టమర్లు మారటోరియం కోసం ప్రయత్నిస్తే కార్డులో ఉన్న లిమిట్ మొత్తం ఊడ్చేస్తున్నారు మోసగాళ్లు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. తమ సిబ్బంది ఎవరూ కార్డు నెంబర్, ఎక్స్పైరీ, సీవీవీ, ఓటీపీ లాంటి వివరాలు అడగరని స్పష్టం చేస్తోంది ఎస్బీఐ. మారటోరియం ఎంచుకోవడానికి ఈ వివరాలేవీ వెల్లడించాల్సిన అవసరం లేదు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. అందుకే ఎవరు కాల్ చేసినా, మెయిల్ చేసినా ఈ వివరాలు చెప్పకూడదని హెచ్చరిస్తోంది ఎస్బీఐ. (ప్రతీకాత్మక చిత్రం)