1. అంతర్జాతీయ పరిస్థితులు, అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుల కారణంగా కంపెనీలకు ఇన్పుట్ ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో కంపెనీలు తమ ప్రొడక్ట్స్ ధరల్ని భారీగా (Price Hike) పెంచుతున్నాయి. వంట నూనెలు (Cooking Oil Prices) , పాలు, కూరగాయలు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇండోనేషియా ఇటీవల పామాయిల్‌పై ఎగుమతి నిషేధాన్ని ఎత్తివేయడం భారతదేశానికి పెద్ద ఊరటనిచ్చింది. దీంతో భారతదేశంలో వంట నూనెల ధరలు దిగొస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు మలేషియా చికెన్ ఎగుమతుల్ని నిషేధించింది. ఇది సింగపూర్, థాయ్‌ల్యాండ్, జపాన్, హాంకాంగ్ లాంటి దేశాలను ప్రభావితం చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఏప్రిల్‌లో, వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయి 7.79 శాతానికి చేరింది. 2021 ఏప్రిల్‌లో ఇది 4.23 శాతం మాత్రమే. ఇక 2022 మార్చిలో ఇది 6.97 శాతంగా ఉంది. ఏప్రిల్‌లో ఆహార ద్రవ్యోల్బణం 8.38 శాతానికి పెరిగింది. అంతకుముందు నెలలో 7.68 శాతంగా ఉంది. క్రితం ఏడాది ఇదే నెలలో 1.96 శాతంగా ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. గత వారం, ఢిల్లీలో టమాటా కిలో రూ.60 నుంచి రూ.80 అమ్ముడయింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో టమాటా ధర సెంచరీ దాటింది. దేశ రాజధాని ఢిల్లీలో నిమ్మకాయ ధర కిలో రూ.200 నుంచి రూ.250 మధ్య పలికింది. కాలీఫ్లవర్ ధర రూ.120, ఆలు ధర రూ.40, ఉల్లిపాయల ధర రూ.40, వంకాయల ధర రూ.80, క్యాప్సికమ్ ధర రూ.130, క్యారట్ ధర రూ.80 చొప్పున ధర పలికాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. మరోవైపు పాల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవల అమూల్, పరాగ్, వెర్కా లీటర్ పాలపై రూ.2 ధర పెంచిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం పెరుగుదల ప్రమాదాన్ని చాలా కాలంగా హెచ్చరిస్తున్నామని, భారతదేశం గత కొంతకాలంగా ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటోందని, చాలా కాలం పాటు పెరిగిన ధరలు ద్రవ్యోల్బణం అంచనాలను మరింత పెంచుతాయని డెలాయిడ్ ఇండియా ఎకనమిస్ట్ రుమ్కీ మజుందార్ అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8. మరో రెండు త్రైమాసికాలు ధరలు పెరగొచ్చని, 2022-23 ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగం తర్వాత ధరలు తగ్గొచ్చని రుమ్కీ మజుందార్ వివరించారు. రాబోయే త్రైమాసికంలో ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరినా ఆశ్చర్యపోవద్దని నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే కనీసం మరో మూడు నెలలు ధరలు పెరగొచ్చని అంచనా. (ప్రతీకాత్మక చిత్రం)