1. సామాన్యులకు మరో పెద్ద షాక్ తగలబోతోంది. త్వరలో గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెరగనుంది. గ్లోబల్ మార్కెట్లో ఇంధన ధరలు పెరిగిపోతుండటంతో గ్యాస్ సిలిండర్ ధరలు (Gas Cylinder Price) పెంచక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. ఏప్రిల్లో గ్యాస్ సిలిండర్ ధర పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. ఏకంగా డొమెస్టిక్ గ్యాస్ ధర రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్న వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రపంచ చమురు మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతుండటంతో ఆ ప్రభావం గ్యాస్ సిలిండర్ ధరలపైనా ఉండనుంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లు మాత్రమే కాదు సీఎన్జీ, పీఎన్జీ, ఎలక్ట్రిసిటీ ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. రవాణా ఖర్చులు, ఫ్యాక్టరీలో ఉత్పత్తుల తయారీ ఖర్చులు కూడా పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇలా అన్నింటి ధరలు పెరిగితే సామాన్యులపై మోయలేని భారం పడే అవకాశం ఉంది. గ్లోబల్ గ్యాస్ కొరత ఏప్రిల్ నుంచి కనిపించే అవకాశం ఉంది. డొమెస్టిక్ నేచురల్ గ్యాస్ ధరలు ప్రతీ ఏడాది ఏప్రిల్లో, అక్టోబర్లో మారుతుంటాయి. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న ధరల్ని బట్టి ఏప్రిల్లో గ్యాస్ ధరల్ని సవరిస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)