1. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 శాతం డియర్నెస్ అలవెన్స్ (DA) పెంచింది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడు పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ (DR) కూడా పెరుగుతుంది. 41.85 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69.76 లక్షల పెన్షనర్లకు డీఏ, డీఆర్ వర్తించింది. దాని ప్రకారమే వేతనాలు, పెన్షన్ వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇటీవల 2022 జూలైకి సంబంధించిన డీఏ పెరిగింది. మళ్లీ 2023 జనవరిలోనే డీఏ పెంపు ఉంటుంది. అయితే ఉద్యోగులకు మరో శుభవార్త వచ్చే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచాలని చాలాకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ డిమాండ్‌కు కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వం ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచితే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ జీతం పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు చివరిసారిగా 2016లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచిన సంగతి తెలిసిందే. అప్పుడు ఉద్యోగుల బేసిక్ వేతనం రూ.6,000 గా ఉంటే రూ.18,000 చేశారు. ఇది జరిగి ఆరేళ్లవుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ సమయంలోనే ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మరోసారి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచితే ఉద్యోగులకు వేతనం పెరుగుతుంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంచితే బేసిక్ వేతనం సుమారు రూ.26,000 కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)