1. కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలు పొందాలంటే లబ్ధిదారులు తప్పనిసరిగా ఆధార్ వివరాలు సమర్పించాలి. ఆధార్ బేస్డ్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అన్ని పథకాల్లో అమలు చేయాలని మంత్రిత్వ శాఖలు, విభాగాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి లబ్ధిదారులు తమ ఆధార్ కార్డ్ (Aadhaar Card) వివరాలను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద గుర్తించబడిన లబ్ధిదారుల జాబితాలో డూప్లికేషన్ తొలగించడంతో పాటు నకిలీ లబ్ధిదారులను తొలగించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై కేబినెట్ సెక్రెటేరియట్ గత నెలలోనే ఆఫీస్ మెమొరండం సమర్పించింది. ఈ ఆఫీస్ మెమొరండం News18 చేతికి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇప్పటికే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం (PM Kisan Scheme) లబ్ధిదారులకు ఆధార్ నెంబర్ ఆధారంగా నేరుగా డబ్బుల్ని జమ చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ నెంబర్కు లింక్ అయిన అకౌంట్లో డబ్బులు జమ అవుతాయి. ఇలాగే మిగతా పథకాల్లో లబ్ధిదారులకు డబ్బులు జమ చేయాలని కేంద్రం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం 53 మంత్రిత్వ శాఖల్లో 313 సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్, కేంద్రం స్పాన్సర్ చేస్తున్న పథకాలు ఉన్నాయి. గత 8 ఏళ్లలో ఈ పథకాల ద్వారా రూ.23 లక్షల కోట్లు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేసినట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల తెలిపారు. మొత్తం డిజిటల్ పద్ధతిలో డీబీటీ ద్వారా జమ చేసినవే. (ప్రతీకాత్మక చిత్రం)
6. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా ఉపయోగించడం ద్వారా పబ్లిక్ సర్వీస్ డెలివరీలో మరింత పారదర్శకత, జవాబుదారీతనాన్ని ఇచ్చేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని కేబినెట్ సెక్రెటేరియట్ ఆర్డర్లో వివరించింది. లబ్ధిదారుల్ని గుర్తించేందుకు ఆధార్ అనేది రియల్ టైమ్లో ఉపయోగపడుతుందని, బోగస్ లబ్ధిదారులను తొలగించగలుగుతామని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
7. బ్యాంక్ అకౌంట్లతో లింక్ అయిన ఆధార్ నెంబర్లు 77 కోట్లకు పైనే ఉన్నాయి. అంటే 77 కోట్ల మంది తమ ఆధార్ నెంబర్ను బ్యాంకు అకౌంట్లకు లింక్ చేశారు. ఆధార్ కార్డు ఆర్థిక చిరునామాగా మారుతుందని కేబినెట్ సెక్రెటేరియట్ చెబుతోంది. లబ్ధిదారుల్ని గుర్తించడానికి ఈ పద్ధతి ఉపయోగపడొచ్చని భావిస్తోంది ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)