2. మరి ఇలాగే బ్యాంకులో డబ్బులు డిపాజిట్ (Bank Deposits) చేసి మర్చిపోతే ఏంటీ పరిస్థితి? మీరు కూడా గతంలో ఎప్పుడైనా బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ (Fixed Deposit) చేసి మర్చిపోయారా? వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్యాంకుల్లో ఖాతాదారులు క్లెయిమ్ చేసుకోని ఫండ్స్ కోట్లల్లో ఉంటాయి. ఈ ఫండ్స్‌ని క్లెయిమ్ చేసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కోరుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. బ్యాంకుల్లో డిపాజిట్ చేసి మర్చిపోయినవారు సంబంధిత బ్యాంకుకు వెళ్లి డిపాజిట్స్ క్లెయిమ్ చేసుకోవాలని ఆర్బీఐ కోరుతోంది. ఇందుకోసం అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంనాటికి బ్యాంకుల్లో రూ.48,262 కోట్ల అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నట్టు ఆర్బీఐ లెక్కలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ క్లోజ్ చేయకపోవడం, ఫిక్స్డ్ డిపాజిట్స్ మెచ్యూర్ అయిన తర్వాత వాటిని రీడీమ్ చేసుకోకపోవడం, డిపాజిట్ చేసిన వ్యక్తులు మరణిస్తే వారి నామినీలు లేదా చట్టపరమైన వారసులు డిపాజిట్లను క్లెయిమ్ చేయడానికి రాకపోవడం లాంటి కారణాలతో ఆ అకౌంట్లలో డబ్బులు అలాగే ఉండిపోతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్స్‌తో పాటు టర్మ్ డిపాజిట్స్ మెచ్యూరిటీ నుంచి పదేళ్ల తర్వాత కూడా ఎవరూ క్లెయిమ్ చేయకపోతే వాటిని అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్‌గా ఆర్బీఐ పరిగణిస్తుంది. ఆ మొత్తం ఆర్బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌లోకి ట్రాన్స్ఫర్ చేయాలి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంతేకాదు అన్క్లెయిమ్డ్ డిపాజిట్ వివరాలను తమ వెబ్సైట్లో వెల్లడించాలి. అందులో డిపాజిట్‌దారుల వివరాలు కూడా ఉండాలి. ఈ వివరాలను డిపాజిట్‌దారులు లేదా వారి నామినీలు చెక్ చేసి బ్యాంకుకు వెళ్లి క్లెయిమ్ చేసుకోవచ్చు. ఆర్బీఐ అధికారుల సమాచారం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, కర్నాటక, బీహార్ రాష్ట్రాల నుంచే ఎక్కువగా అన్క్లెయిమ్డ్ ఫండ్స్ ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ డబ్బులు క్లెయిమ్ చేసుకోవాలంటే డిపాజిట్ దారులు లేదా నామినీలు బ్యాంక్ వెబ్సైట్లో వెల్లడించిన వివరాలు చెక్ చేయాలి. ఆ వివరాలతో పాటు రీఫండ్ కోసం రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయాలి. అందులో అకౌంట్ నెంబర్, ఫోటో, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ లాంటి వివరాలన్నీ సబ్మిట్ చేయాలి. బ్యాంకు సిబ్బంది ఈ వివరాలను పరిశీలించిన తర్వాత డబ్బుల్ని వారం రోజుల్లో అకౌంట్లో జమ చేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)