4. అటల్ పెన్షన్ యోజన-APY సబ్స్క్రైబర్లు ఆటోడెబిట్ ఫెసిలిటీ ద్వారా నెలకు, మూడు నెలలకు, ఆరు నెలలకోసారి డబ్బులు జమ చేయొచ్చు. అటల్ పెన్షన్ యోజన-APY పథకం 2015లో ప్రారంభమైంది. ఈ ఐదేళ్లలో 2 కోట్ల 40 లక్షల మందికి పైగా సబ్స్క్రైబర్లు చేరారు. వృద్ధాప్యంలో పెన్షన్ కోరుకునేవారికి ఉపయోగపడే పథకం ఇది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అటల్ పెన్షన్ యోజన ద్వారా కనీసం రూ.1000 నుంచి గరిష్టంగా రూ.5000 వరకు పెన్షన్ పొందొచ్చు. కనీసం 18 ఏళ్ల నుంచి గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు ఉన్నవారు ఈ పెన్షన్ పథకంలో చేరి నెలనెలా కొంత పొదుపు చేస్తే వృద్ధాప్యంలో వారికి రూ.1000 నుంచి రూ.5000 మధ్య పెన్షన్ లభిస్తుంది. పొదుపు చేసే మొత్తాన్ని బట్టి ఈ పెన్షన్ ఆధారపడి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8. పెన్షన్ తీసుకుంటున్న సమయంలో లబ్ధిదారులు మరణిస్తే వారికి పెన్షన్ కార్పస్ కూడా లభిస్తుంది. ఇది తీసుకునే పెన్షన్ పైన ఆధారపడి ఉంటుంది. పెన్షన్ రూ.1,000 అయితే పెన్షన్ కార్పస్ రూ.1,70,000, పెన్షన్ రూ.2,000 అయితే రూ.3,40,000, పెన్షన్ రూ.3,000 అయితే రూ.5,10,000, పెన్షన్ రూ.4,000 అయితే రూ.6,80,000, పెన్షన్ రూ.5,000 అయితే రూ.8,50,000 పెన్షన్ కార్పస్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)