పాన్ కార్డును ఆధార్ కార్డుతో అనుసంధానించడం, ఆదాయపు పన్ను, బ్యాంకింగ్ వంటి అనేక ముఖ్యమైన పనులు జూన్ 30, 2021ని గడువుగా నిర్ణయించారు. అప్పటిలోగా ఈ పనులను పూర్తి చేయకపోతే మీరు భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
2/ 11
అంతే కాకుండా.. బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణలో కడా సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. బ్యాంకు ఖాతాలను మూసివేసే అవకాశం కూడా ఉంది.(ప్రతీకాత్మక చిత్రం)
3/ 11
Aadhaar-PAN Link: మీరు ఇంకా ఆధార్‌ను పాన్ కార్డ్‌తో లింక్ చేయకపోతే , ఇప్పుడే చేసేయండి. పాన్ మరియు ఆధార్లను లింక్ చేయడానికి చివరి తేదీగా 30 జూన్ 2021ని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.(ప్రతీకాత్మక చిత్రం)
4/ 11
జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ లేని వారు రూ .1,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా, పాన్ కార్డు ఇన్ యాక్టీవ్ అవుతుంది. ఆధార్, పాన్ కార్డు లింక్ చేయకపోతే జూన్ 30 అనంతరం లావాదేవీల నిర్వహణ నిలిపివేస్తామని ఇప్పటికే SBI తన కస్టమర్లకు స్పష్టం చేసింది.(ప్రతీకాత్మక చిత్రం)
5/ 11
TDS- జూన్ 30 లోపు మీరు ఆదాయపు పన్ను దాఖలు చేయకపోతే, మీరు జూలైలో టీడీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను శాఖ తరపున, పన్ను చెల్లించనందుకు కఠినమైన నిబంధనలు జారీ చేయబడ్డాయి.(ప్రతీకాత్మక చిత్రం)
6/ 11
2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను దాఖలు చేయడానికి ఐటిఆర్ దాఖలు చేయడానికి గడువు జూలై 31 నుండి సెప్టెంబర్ 30 వరకు పొడిగించబడింది. కొత్త నిబంధనల ప్రకారం జూలై 1, 2021 నుంచి టిడిఎస్ మరియు టిసిఎస్ 10-20 శాతం ఉంటుంది. ఇది సాధారణంగా 5-10 శాతం ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
7/ 11
PM Kisan: కరోనా మహమ్మారి మధ్యలో, కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజనలో ఎనిమిదవ విడత రూ .2,000 ను రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. కానీ ఈ పథకంలో నమోదు చేయని రైతులు ఇంకా చాలా మంది ఉన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 11
ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందడానికి, జూన్ 30 లోగా నమోదు చేసుకోవాలి. దీంతో మీకు రూ. 4000 లభిస్తాయి.(ప్రతీకాత్మక చిత్రం)
9/ 11
సిండికేట్ బ్యాంక్ వినియోగదారులకు ఈ వార్త చాలా ముఖ్యం. ఏప్రిల్ 1, 2020 న సిండికేట్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ కెనరాలో విలీనం అయిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంక్ ఐఎఫ్ఎస్సీ కోడ్ జూలై 1 నుంచి మార్చనుంది.(ప్రతీకాత్మక చిత్రం)
10/ 11
సిండికేట్ బ్యాంక్ యొక్క IFSC కోడ్ జూన్ 30 వరకు మాత్రమే చెల్లుతుంది. బ్యాంక్ యొక్క కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ జూలై 1 నుండి అమలులోకి వస్తుంది. ఖాతాదారులు బ్రాంచ్ ను సంప్రదించి కొత్త IFSC కోడ్ ను తెలుసుకోవాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
11/ 11
వీటితో పాటు SBI, HDFCతో సహా పలు బ్యాంకులు నిబంధనలను మార్చబోతున్నాయి. SBI, HDFC, ICICI, Bank of baroda సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక FD ఆఫర్లతో ముందుకు వచ్చాయి. ఈ ఆఫర్ జూన్ 30, 2021 తో ముగియనున్నాయి.(ప్రతీకాత్మక చిత్రం)