4. Kalyan Jewellers: కళ్యాణ్ జ్యువెలర్స్ గోల్డ్ ఓనర్షిప్ సర్టిఫికెట్స్‌ని ఆన్లైన్లో అమ్ముతోంది. కస్టమర్లు ఆన్లైన్లో బంగారం కొంటే అక్షయ తృతీయ రోజున గోల్డ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ ఇస్తుంది. అంటే ఎంత బంగారం కొంటే అంత వ్యాల్యూతో ఈ సర్టిఫికెట్ వస్తుంది. కాబట్టి కస్టమర్లు ఇంట్లో ఉన్నా బంగారం కొనొచ్చు.
5. Tanishq: తనిష్క్ జ్యువెలర్స్ కూడా ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై ఆఫర్స్ ప్రకటించింది. ఈ ఆఫర్ ఏప్రిల్ 27 వరకు ఉంటుంది. తనిష్క్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై బంగారం కొన్నవాళ్లు లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత స్టోర్‌కు వెళ్లి నగలు తీసుకోవచ్చు. లేదా డోర్ డెలివరీ సదుపాయం కూడా ఉంటుంది. వీడియో కాలింగ్, లైవ్ అసిస్టెడ్ ఛాట్ ద్వారా తనిష్క్ సిబ్బందిని కాంటాక్ట్ కావొచ్చు.