AKSHAYA TRITIYA 2019 GOLD SALES UP OVER 25 PERCENT THAN PREVIOUS YEAR AKSHAYA TRITIYA SS
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు ఎంత బంగారం కొన్నారో తెలుసా?
Akshaya Tritiya 2019 | అక్షయ తృతీయ... ఈ పర్వదినం వచ్చిందంటే నగల దుకాణాలు కళకళలాడుతుంటాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే శుభమని నమ్మకం. అందుకే ఉన్నంతలో బంగారం కొనేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు. మరి ఈ అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు ఎలా ఉన్నాయి? ప్రజలు ఎంత బంగారాన్ని కొన్నారు? తెలుసుకోండి.
1. మే 7న మంగళవారం నాడు అక్షయ తృతీయ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు భారతీయులు. అక్షయ తృతీయ మంగళవారం రావడంతో బంగారం అమ్మకాలు పెద్దగా ఉండకపోవచ్చన్న వాదన వినిపించింది. కానీ అక్షయ తృతీయ రోజున బంగారం దుకాణాలన్నీ కస్టమర్లతో కళకళలాడాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. గత మూడేళ్లుగా చూస్తే అక్షయ తృతీయ రోజున కూడా అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఈసారి అక్షయ తృతీయ మాత్రం నగల దుకాణాలకు పండుగను తలపించాయి. కస్టమర్లు ఏకంగా ప్రీ-బుకింగ్‌లు చేయడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. అక్షయ తృతీయకు కొన్ని రోజుల ముందుగానే ఆర్డర్లు ఇచ్చి, అక్షయ తృతీయ రోజున నగలు తీసుకెళ్లారు కస్టమర్లు. మొత్తంగా అక్షయ తృతీయ రోజున బంగారం అమ్మకాలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. గతేడాది కన్నా ఈసారి అక్షయ తృతీయ రోజున 25 శాతం అమ్మకాలు పెరిగాయని లెక్కలు చెబుతున్నాయి. ఎప్పట్లాగే ఉత్తర భారతదేశంలో అమ్మకాలు ఎక్కువగానే జరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఈ ఏడాది పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉండటం కూడా నగల అమ్మకాలు పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. పెళ్లిళ్లకు నగలు కొనడం మాత్రమే కాదు... అక్షయ తృతీయ రోజున కనీసం ఒకట్రెండు గ్రాములైనా కొనాలన్న సెంటిమెంట్‌తో కస్టమర్లు షాపులకు రావడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. గతేడాది అక్షయ తృతీయ రోజున ఉన్న ధరతో పోలిస్తే ఈసారి అదే రోజు బంగారం ధర 7 శాతం తక్కువగా ఉంది. బంగారం అమ్మకాలు పెరగడానికి ఇది కూడా ఓ కారణం. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. ఈ అక్షయ తృతీయ రోజున ఒక్క హైదరాబాద్‌లోని 250 కిలోలకు పైగా బంగారం అమ్ముడు పోయిందని అంచనా. దేశవ్యాప్తంగా చూస్తే 40-50 టన్నుల్లోనే ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)