* ఉచితంగా యాప్ : AIS ఫర్ ట్యాక్స్‌పేయర్ యాప్‌ను ఆదాయ పన్ను శాఖ ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్(Google Play Store), యాప్ స్టోర్(App Stor)eలో అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన వివిధ సోర్సెస్ నుంచి సేకరించిన సమాచారాన్ని AIS/TIS కాంప్రహెన్సివ్ వ్యూ ద్వారా పన్ను చెల్లింపుదారులకు అందించడం దీని లక్ష్యం.
* IT యాప్‌లో ఏ డాక్యుమెంట్లు(Documents) చూడవచ్చు..? : AIS/TISలో అందుబాటులో ఉన్న TDS/TCS, వడ్డీ, డివిడెండ్లు, షేర్ లావాదేవీలు, పన్ను చెల్లింపులు, ఆదాయ పన్ను రీఫండ్లను యాప్‌లో చూడవచ్చు. అంతే కాకుండా ఇతర సమాచారం GST డేటా, విదేశీ చెల్లింపులు మొదలైనవాటికి సంబంధించిన సమాచారాన్ని పన్ను చెల్లింపుదారులు మొబైల్ యాప్‌లో తెలుసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుకు యాప్‌లో కనిపించే సమాచారంపై ఫీడ్‌బ్యాక్‌ను అందించే అవకాశం ఉంది.
* ఎలా యాక్సెస్ చేయాలి? : యాప్‌ను ఉపయోగించాలనుకునే పన్ను చెల్లింపుదారులు వారి పాన్ నంబర్(PAN Number) ద్వారా యాప్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. వారి మొబైల్ నంబర్‌కు పంపిన ఓటీపీ(OTP), ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న ఇ-మెయిల్ అడ్రెస్‌తో అథెంటికేషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత పన్ను చెల్లింపుదారు మొబైల్ యాప్‌ను యాక్సెస్ చేయడానికి 4 అంకెల పిన్ని సెట్ చేయవచ్చు.
* ఆదాయ పన్ను రిటర్న్ ఫైలింగ్ చివరి తేదీ : ఆదాయ పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేయడానికి చివరి తేదీ జులై 31. 2022-2023 అసెస్మెంట్ ఇయర్ ఏప్రిల్ 1న ప్రారంభమవుతుంది. గతంలో ప్రభుత్వం వివిధ కారణాల వల్ల ITR ఫైలింగ్ గడువు తేదీలను పొడిగించింది. ఈ సంవత్సరం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) అసెస్మెంట్ ఇయర్ 2023-24కి సంబంధించిన కొత్త ITR ఫారంలను ఒక నెల ముందుగానే నోటిఫై చేసింది.