జమ్మూకాశ్మీర్‌లో భారతీ ఎయిర్టెల్ నెట్‌వర్క్‌ను ఉపయోగించి... ఇండియన్ ఆర్మీకి చెందిన డేటాను ఓ హ్యాకర్ల గ్రూప్ లీక్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఐతే... ఎయిర్టెల్ కంపెనీ మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. తమ వ్యవస్థలో ఎలాంటి సెక్యూరిటీ లోపాలూ రాలేదని తెలిపింది. ఆ హ్యాకర్ల గ్రూపును రెడ్ రాబిట్ టీమ్ (Red Rabbit Team) అని పిలుస్తున్నారు. ఈ గ్రూపు కొన్ని భారత వెబ్సైట్లను హ్యాక్ చేసి... తాను దొంగిలించిన ఆర్మీ డేటాను ఆ సైట్లలో పోస్ట్ చేసింది. హ్యాకర్లు ఆ వెబ్‌పేజీల కొన్ని లింకులను సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు రాజశేఖర్ రాజహరియా ట్విట్టర్ అకౌంట్లోని ఓ ట్వీట్ కింద రిప్లైలో షేర్ చేసారు. అలాగే కొన్ని మీడియా సంస్థలకు కూడా షేర్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
దీనిపై ఇండియన్ ఆర్మీని ఆరా తీయగా... పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఓ ఆర్మీ పర్సన్ మాత్రం... "మాకు అలాంటి విషయం ఏదీ తెలియదు. కానీ ఏదో జరుగుతున్నట్లు మాకు అనిపిస్తోంది" అని అన్నారు. దీనిపై భారతీ ఎయిర్టెల్ ప్రతినిధిని కలవగా... తమ సర్వర్‌లో ఎలాంటి లోపమూ జరగలేదని అన్నారు. "ఆ గ్రూప్ చెప్పినట్లు ఎయిర్ టెల్ వ్యవస్థలో ఎలాంటి లోపమూ జరగలేదని మేము నిర్దారిస్తున్నాం. ఎయిర్‌టెల్‌కి సంబంధం లేని ఎంతో మంది చట్ట ప్రకారం కొన్ని రకాల డేటాను తీసుకుంటూ ఉంటారు. ఈ విషయంపై సంబంధిత అధికారులకు మేం సమాచారం ఇచ్చాం. వారు దీన్ని పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటారు" అని కంపెనీ తెలిపింది. "ఈ హ్యాకర్ల గ్రూపు మా సెక్యూరిటీ టీమ్‌తో 15 నెలలకు పైగా టచ్‌లో ఉంది. అలా ఏదో డేటా సేకరించి... దాన్ని పోస్ట్ చేసి.. ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నట్లుంది" అని కంపెనీ ప్రతినిధి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
హ్యాకర్లు వేసిన లింక్స్ మొదట్లో... ఎవరైనా క్లిక్ చేస్తే... మొబైల్ నంబర్, నేమ్, అడ్రెస్ అడిగి ఓపెన్ అయ్యాయి. ఆ తర్వాత కాసేపటికి పనిచేయడం మానేశాయి. PTIకి ఈ రెడ్ రాబిట్ టీమ్ ఓ సందేశం పంపింది. "మేము ఇండియా వ్యాప్తంగా భారతీ ఎయిర్టెల్ డేటాను సేకరించాం. కంపెనీ సర్వర్లోకి మేము ఓ షెల్ అప్లోడ్ చేశాం. త్వరలోనే మరింత డేటా లీక్ చేస్తాం" అని తెలిపింది. "ఈ గ్రూపు సబ్స్క్రైబర్ల డేటాను పొందిందా లేదా అన్నది తెలియట్లేదు. అలాగే... ఈ గ్రూపు... భారతీ ఎయిర్టెల్ దేశవ్యాప్త డేటాను సేకరించింది అనేందుకు నమ్మదగిన ఆధారం లేదు" అని రాజాహరియా తెలిపారు. "వారి ఆరోపణలు ఫేక్ కావచ్చు. SDR పోర్టల్‌లో వీడియో నిజమైనదిలాగే ఉంది. ఐతే... కొద్ది మొత్తంలో మాత్రమే డేటా లీకై ఉండొచ్చు. వారు మొత్తం జమ్మూకాశ్మీర్ డేటా పొందగలిగారా అన్నది అస్పష్టంగా ఉంది" అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
టెలికం ఆపరేటర్లు... తమ డేటాను ప్రభుత్వం, చట్ట బద్ధ సంస్థల కోసం... సబ్‌స్క్రైబర్ డేటా రిజిస్ట్రేషన్ (SDR) పోర్టల్‌కి ఇస్తారు. దీని ద్వారా ఫోన్ నంబర్లు, సబ్‌స్ర్కైబర్ల వివరాలను వెరిఫై చేస్తారు. ఆ హ్యాకర్లు పాకిస్థాన్‌కి చెందిన వారు కావచ్చని రాజాహరియా అన్నారు. ఎయిర్డేటాగా చెబుతున్న డేటాను అప్లోడ్ చేయడానికి డిసెంబర్ 4, 2020న ఓ వెబ్‌సైట్‌ను హ్యకర్లు హ్యాక్ చేశారు. మై క్లే అనే హ్యాకర్ల గ్రూప్ ఈ పని చేసింది. దీన్నే టీమ్ లీట్స్ అంటారు. ఇది పాకిస్థాన్‌కి చెందిన హ్యాకర్ల గ్రూప్. (ప్రతీకాత్మక చిత్రం)