ఢిల్లీ నుంచి గోవాకు అయితే టికెట్ రేటు రూ. 5656గా ఉంది. అలాగే ఢిల్లీ నుంచి పోర్ట్ బ్లెయిర్‌కు టికెట్ రేటు రూ. 8690గా, ఢిల్లీ నుంచి శ్రీనగర్‌కు టికెట్ రేటు రూ. 3730గా ఉన్నాయి. ఇంకా అహ్మదాబాద్ నుంచి ముంబైకి టికెట్ రేటు రూ. 1806గా ఉంది. గోవా నుంచి ముంబైకి రూ. 2830గా, దిమాపూర్ నుంచి గువాహటికి రూ. 1783గా టికెట్ రేట్లు ఉన్నాయి.
కాగా మరోవైపు ఏవియేషన్ రెగ్యులేటర్ డీజీసీఏ శుక్రవారం ఎయిర్ ఇండియాపై ఏకంగా రూ. 30 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. అలాగే న్యూయార్క్ ఢిల్లీ ఫ్లైట్ పైలెట్ ఇన్ కమాండ్ల్ లైసెన్స్ కూడా రద్దు చేసింది. అంతేకాకుండా ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆఫర్ ఇన్ ఫ్లైట్ సర్వీసెస్‌కు కూడా రూ. 3 లక్షల జరిమానా వేసింది.