1. ఎయిర్ ఇండియా కొత్త పాలసీని ప్రకటించింది. రిటైర్మెంట్ తర్వాత కూడా పైలట్ల సేవల్ని వినియోగించుకోనుంది. పైలట్లకు 65 ఏళ్ల వయస్సు వచ్చేవరకు వారి సేవల్ని ఉపయోగించుకోనుంది. పోస్ట్ రిటైర్మెంట్ తర్వాత పైలట్లను నియమించుకునేందుకు సరికొత్త పాలసీని ప్రకటించింది. ఇప్పటివరకు పైలట్లకు రిటైర్మెంట్ వయస్సు 58 ఏళ్లుగా ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
2. కొత్త పాలసీ ప్రకారం పైలట్లను రిటైర్మెంట్ తర్వాత 5 ఏళ్లపాటు కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. వారికి 65 ఏళ్ల వయస్సు వచ్చేవరకు కాంట్రాక్ట్ గడువు పొడిగిస్తారు. రిటైర్మెంట్ తర్వాత అంటే 58 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత పైలట్లను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయనుంది ఎయిర్ ఇండియా. (ప్రతీకాత్మక చిత్రం)
4. డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) పైలట్లను 65 సంవత్సరాల వయస్సు వరకు విమానాలు నడిపేందుకు అనుమతించినందున ఎయిర్ ఇండియా పోస్ట్ రిటైర్మెంట్ ఎంగేజ్మెంట్ ప్లాన్‌కు ఎలాంటి చిక్కులు ఎదురుకావు. కరోనా మహమ్మారి తర్వాత విమానయాన రంగం వేగంగా కోలుకుంటున్నందున ఎయిర్ ఇండియా తన విమాన సేవల్ని విస్తరించాలనే యోచనలో ఈ నిర్ణయానికి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. టాటా గ్రూప్ భారత ప్రభుత్వం నుంచి ఎయిర్ ఇండియాను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. విస్తరణ ప్రణాళికలో భాగంగా 75 నుంచి 100 మిలియన్ డాలర్లను వెచ్చించనుంది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రస్తుతం 24 బోయింగ్ 737-800 విమానాలను నడుపుతోంది. భవిష్యత్తులో మరిన్ని విమానాలను జోడించడం కోసం పెట్టుబడి పెడుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)