ముంబైలో కూడా వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర నిన్నమొన్నటి వరకూ 1,683 రూపాయలు ఉండగా, తాజా పెంపుతో రూ.1,950కి చేరింది. కోల్‌కత్తాలో అయితే.. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 2వేల మార్క్‌ను కూడా దాటిపోయింది. తాజా పెంపుతో.. కోల్‌కత్తాలో కమర్షియల్ సిలిండర్ ధర 2,073.50 పలుకుతోంది. ఇక.. దక్షిణాదిలో కూడా కమర్షియల్ సిలిండర్ ధర ఆకాశాన్నంటింది.
కోల్‌కత్తాలో 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్ ధర రూ.926గా ఉండగా, చెన్నైలో రూ.915.50గా ఉంది. క్రూడ్ ఆయిల్ ధరల్లో పెరుగుదల కారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ ఎగబాకుతున్న క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధర కూడా పరుగులు పెడుతోంది. గృహావసర వంట గ్యాస్ సిలిండర్ ధర కూడా త్వరలో రూ.1000 మార్క్‌ను చేరుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.