విద్యావంతులు, ఉన్నత చదువులు అభ్యసించిన వారి ఆలోచన విధానాలు మారుతున్నాయి. ఎవరి దగ్గరో నెల జీతానికి పని చేయడం కంటే తామే ఏదో ఓ వ్యాపారం లేదంటే వ్యవసాయం అది కాదంటే ఓ స్టార్టప్ బిజినెస్ ప్రారంభించి నలుగురికి ఉపాధి కల్పించాలని భావిస్తున్నారు. అందులో సక్సెస్‌ని రుచి చూస్తున్నారు. లక్షలు సంపాధిస్తున్నారు. బీహార్ బెగుసరాయ్‌కి చెందిన అమన్‌కుమార్ కూడా ఇదే విధంగా ఆలోచించాడు.
బెగుసరాయ్ జిల్లాలోని సదర్ బ్లాక్‌లోని రామ్దిరి గ్రామానికి చెందిన అమన్‌కుమార్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.నవాడాలో ఓ మల్టీ నేషనల్ కంపెనీలో మంచి జీతంతో ఉద్యోగం చేశాడు.సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో గ్రామస్తులు వ్యవసాయం చేయడం చూసి తాను కూడా ఉద్యోగం మానేసి వ్యవసాయం చేస్తే బాగుంటుందని ఫీలయ్యాడు.
ఇంటి దగ్గరే ఏదో ఒకటి చేయాలన్న అమన్‌కుమార్ ఆలోచనకు, చదువు తోడవటంతో వ్యవసాయానికి సంబంధించిన వ్యాపారం బెటర్ అని ఫీలై పుట్టగొడుగుల ఉత్పత్తిలోకి దిగాడు. పత్యా టెక్నాలజీ ఆధారిత పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తూ తనతో పాటు మరో 10మందికి ఉపాధి కల్పిస్తూ లక్షల రూపాయల లాభం పొందుతున్నాడు.అంతే కాదు పుట్టగొడుగులతో పాటు స్ట్రాబెర్రీ సాగును కూడా మొదలుపెట్టి అందులో కూడా విజయవంతం అవుతున్నాడు.
ఇంజనీరింగ్ చదివి..పుట్టగొడుగుల పెంపకంలో అడుగుపెట్టిన ఈ యువ మేధావి ప్రతినెలా 4 నుంచి 5 లక్షల విలువైన పుట్టగొడుగులను విక్రయిస్తున్నాడు. దీని ద్వారా ఖర్చులు, కూలీల జీతాలు, పెట్టుబడి పోగా నెలకు లక్ష వరకు ఆదాయం పొందుతున్నారు. సమస్తిపూర్ జిల్లాకు చెందిన కుందన్ కుమార్ కూడా తన పుట్టగొడుగుల తయారీలో పనిచేస్తూ నెలకు 20 వేల వరకు జీతం పొందుతున్నాడు. మరోవైపు ఇతర కూలీలకు వారి పనిని బట్టి నెలవారీ వేతనం చెల్లిస్తున్నారు.