Business Idea: కీరదోసతో రూ.2 లక్షల ఆదాయం..ఎలాగంటే?
Business Idea: కీరదోసతో రూ.2 లక్షల ఆదాయం..ఎలాగంటే?
సంప్రదాయ పంటకు స్వస్తి పలికి లాభదాయ పంట వైపు అడుగులు వేసాడు ఓ రైతు. తక్కువ పెట్టుబడి..తక్కువ ఖర్చు..తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటను ఎంచుకున్నారు. ఈ మేరకు మార్కేట్ లో మంచి డిమాండ్ ఉన్న కీరదోస పంట సాగుకు బై బ్యాక్ ఒప్పందం చేసుకున్నారు. లక్షల్లో లాభాలు గడిస్తున్నారు. P.Mahendar,News18,Nizamabad
సంప్రదాయ పంటకు స్వస్తి పలికి లాభదాయ పంట వైపు అడుగులు వేసాడు ఓ రైతు. తక్కువ పెట్టుబడి..తక్కువ ఖర్చు..తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు ఇచ్చే పంటను ఎంచుకున్నారు. ఈ మేరకు మార్కేట్ లో మంచి డిమాండ్ ఉన్న కీరదోస పంట సాగుకు బై బ్యాక్ ఒప్పందం చేసుకున్నారు.
2/ 13
దీంతో కీరదోసకు యేడాదంతా సీజనే. ఎప్పుడైనా ఈ పంటను సాగు చేయవచ్చు. ఒక్క సీజన్ కు ఖర్చులు పోను రెండు లక్షల రూపాయలు సంపాదిస్తూ రైతులకు ఆధర్శంగా నిలుస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ రైతు. కీరదోస సాగు విధానంపై న్యూస్ 18 ప్రత్యేక కథనం మీకోసం.
3/ 13
నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండలం చింతలూరు గ్రామానికి చెందిన రైతు గోపిడీ శ్రీనివాస్. తనకు పది ఏకరాల సాగు భూమి ఉంది. అయితే ఐదు ఎకరాల్లో వరి సాగు చేసారు. మరో రెండున్నర ఏకరాల్లో మొక్కజోన్న సాగు చేసారు. మరో రెండు ఎకరాల్లో సూక్ష్మ సేద్యం ద్వారా కీరదోస పంట సాగుచేస్తున్నారు.
4/ 13
పసుపు పంటను తవ్విన తరువాత కీరదోస వేసాడు. ఇప్పుడు కీరదోస పంట చేతికి వచ్చింది. రోజు తప్పించి రోజు కీరదోసను తెంపుతున్నారు. అయితే మొదటి మూడు కోతలకు రెండు, మూడు టన్నుల దిగుబది వచ్చింది.
5/ 13
ఐదో కొత నుంచి 13 టన్నుల దిగుబడి వచ్చింది. పెట్టుబడి పోను ఒక సీజన్ కు రెండు లక్షల ఆదాయం వస్తుంది. అయితే ఓ కంపెనీతో కొనుగోలు ఒప్పందం చేసుకొని వేసవిలో కీరదోసకు డిమాండ్ అధికంగా ఉంటుంది.
6/ 13
దీనితో గత నాలుగు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు. ఎకరానికి 10 వేల విత్తనాలు చల్లుతారు. సేంద్రియ ఎరువులు పిచికారీ చేయడంతో పాటు లింగాకర్షక బుట్టలు వినియోగించి చీడపీడలు రాకుండా పంటను కాపాడుకుంటారు.
7/ 13
వానకాలం సాగు కొంత ఇబ్బందికరంగా ఉన్న మిగిలిన సీజన్లలో లాభాలు గడించొచ్చు. విత్తనం నాటిన 45 రోజులకు పంట కొతకు వస్తుంది. ఒక్క సీజన్ లో 15 సార్లు కోత వస్తుంది.
8/ 13
మొదటి నాలుగు ఖాతాలో స్వల్ప దిగుబడి వస్తుంది. ఐదు నుంచి 12 కొతలు ఎకరాకి 15 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.. ప్రతి సీజన్లో విత్తనం మొదలుకొని కూలీల ఖర్చు పోను ఎకరాకి లక్ష ఆదాయం వస్తుంది.
9/ 13
పంట మూడు సీజన్లో సాగు చేసే ఎకరాకి మూడు లక్షల చొప్పున ఏడాది ఆరు లక్షల ఆదాయం పొందుతున్నారు.
10/ 13
నాకు 10 ఎకరాల సాగు భూమి ఉందని గొపిడి శ్రీనివాస్ అంటున్నారు. సాంప్రదాయ పంటలుగా వరి సాగు, మొక్కజొన్న, పసుపు పంటలను సాగు చేస్తాను.
11/ 13
అయితే ఈ కీరదోస అనేది చాలా స్వల్ప కాలికంగా వస్తుంది. మూడు సీజన్లు వేసుకునే అవకాశం ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఈ కీరదోస సాగు చేస్తున్నాను.
12/ 13
ఇక టన్ను 9 వేల ధర పలుకుతుంది. కంపెనీతో బై బ్యాక్ ఒప్పందం చేసుకున్నాం. నాతో పాటు మరికొంతమంది రైతులను ఈ పంట సాగు చేస్తున్నాం. పంట నాటిన 45 రోజుల నుంచి పంట కూతదశకు వస్తుంది.
13/ 13
రోజు విడిచి రోజు కీరదోసను కోసుకోవచ్చు. 80 రోజుల్లో ఈ యొక్క సీజన్ ముగుస్తుంది.. మనకి 80 రోజుల్లో ఖర్చులు పోను ఎకరాకి లక్ష ల రూపాయల వరకు లాభం వస్తుందని రైతు శ్రీనివాస్ చెబుతున్నారు.