సోమవారం తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అక్కడక్కడ కొద్దిమేర మాత్రం పెరిగాయి. సోమవారం హైదరాబాద్లో పెట్రోల్ (petrol) ధర లీటర్కి రూ.113.72 గా ఉంది. ఆదివారం రూ.113.36 ఉంది. కరీంనగర్ (Karimnagar)లో పెట్రోల్ ధర రూ.113.90 గా ఉంది. డీజిల్ ధర రూ.107.14కు చేరింది. నిజామాబాద్లో పెట్రోల్ ధర రూ.115.35 గా ఉంది. డీజిల్ ధర రూ.108.49 గా ఉంది.
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి.
ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 28, 2021 నాటి ధరల ప్రకారం 85.65 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. అందుకే ఇంధన ధరలు మన దేశంలో జీవితాల గరిష్ఠానికి చేరుతూ సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.