1. భారతీయ రైల్వే దేశంలోని ప్రధాన రైల్వే స్టేషన్లను (Railway Station) పునరాభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగా విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేయనుంది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌కు హెడ్‌క్వార్టర్స్‌గా విశాఖపట్నం రైల్వే స్టేషన్ మారనుంది. రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA) రూ.393 కోట్ల విలువైన విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల కోసం బిడ్స్ ఆహ్వానిస్తోంది. (image: Indian Railways)
2. రైల్వేకు చెందిన భూమిని కమర్షియల్ అవసరాలకు ఉపయోగించేలా పునరాభివృద్ధి చేసేందుకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన సంస్థ ఆర్ఎల్డీఏ. ఇప్పుడు ఈ సంస్థ విశాఖపట్నం రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం బిడ్స్ ఆహ్వానిస్తోంది. నిర్మాణ సంస్థలు ఆగస్ట్ 12 లోగా బిడ్స్ దాఖలు చేయొచ్చు. 36 నెలల్లో పనులు పూర్తి చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌ను పునరాభివృద్ధి చేస్తే ఎలా ఉండబోతుందో తెలిపేలా భారతీయ రైల్వే డిజైన్‌ను విడుదల చేసింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ భవనం అద్భుతంగా ఉండబోతోంది. ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ పద్ధతిలో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నామని, ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సదుపాయాలు లభిస్తాయని రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ ఛైర్మన్ వేద్ ప్రకాశ్ దుదేజా తెలిపారు. (image: Indian Railways)
4. విశాఖపట్నం భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఒకటని, ఇటీవల కాలంలో ఐటీ రంగం అభివృద్ధి కారణంగా ఆర్థిక కార్యకలాపాలు కూడా పుంజుకున్నాయని, విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరభివృద్ధి స్థానిక ఆర్థిక వ్యవస్థపై గుణాత్మక ప్రభావాన్ని చూపుతుందని, అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తుందని వేద్ ప్రకాశ్ దుదేజా అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కొత్త రైల్వే స్టేషన్లో ప్రయాణికులు నడిచేందుకు అత్యాధునిక స్కైవాక్‌లు ఉంటాయి. ప్లాట్‌ఫామ్స్ పైన డిపార్చర్ హాల్స్, కామన్ వెయిటింగ్ ఏరియాను నిర్మిస్తారు. ఈ రెండింటినీ కలుపుతూ రూఫ్ ప్లాజాను నిర్మిస్తారు. మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌తో పనిచేసే స్మార్ట్ పార్కింగ్ సిస్టమ్, రీటైల్, ఆఫీస్ స్పేసెస్, రిటైరింగ్ రూమ్స్, మెడికల్ ఎమర్జెన్సీ రూమ్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇటీవల భారతీయ రైల్వే తిరుపతి రైల్వే స్టేషన్‌ను వాల్డ్ క్లాస్ రైల్వే హబ్‌గా మారుస్తామని ప్రకటించింది. అన్ని కాంట్రాక్టులు ఇచ్చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా ప్రకటించారు. తిరుపతి రైల్వే స్టేషన్ డిజైన్‌ను కూడా విడుదల చేశారు. 2023 నాటికి తిరుపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఆలస్యమైంది. (image: Indian Railways)
7. తిరుపతి రైల్వే స్టేషన్లో ఓపెన్ వెయిటింగ్ హాల్, ఎయిర్‌పోర్టు తరహా లైటింగ్, ప్రీమియం ఏసీ వెయిటింగ్ లాంజ్, ఇతర సదుపాయాలు ఉంటాయి. తిరుపతి రైల్వే స్టేషన్లో మొత్తం 23 లిఫ్టులు, 20 ఎస్కలేటర్లు, ఇన్ఫర్మేషన్ డిస్ప్లే సిస్టమ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, సీసీటీవీ కెమెరాలు, కోచ్ ఇండికేషన్, ట్రైన్ ఇండికేషన్ బోర్డులతో ప్రపంచ స్థాయి సదుపాయాలు రానున్నాయి. (image: Indian Railways)