ఈ లిస్ట్‌ను పరిశీలించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అంతిమంగా ఒక నిర్ణయానికి రానుంది. దిగుమతులను ఖరీదుగా మారిస్తే.. అప్పుడు దేశీయంగా తయారీ పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. డిసెంబర్ నెలలో వాణిజ్య మంత్రిత్వ శాఖ పలు మంత్రిత్వ శాఖలను దిగుమతి సుంకాలను పెంచడానికి ఛాన్స్ ఉన్న ప్రొడక్టుల వివరాలు తెలియజేయాలని కోరింది.
ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ 2023 ఆవిష్కరించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి కూడా బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈసారి బడ్జెట్‌పై సామాన్యులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కేంద్రం ఎలాంటి వరాలు అందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. తాయిలాలు ఉంటాయో .. ఉండవో .. ఇంకొక రోజు లోనే తేలిపోతుంది.