రియల్ ఎస్టేట్పై మక్కువతో చాలామంది ప్రజలు మళ్ళీ హోం లోన్ తీసుకునేందుకు ఆసక్తి చూపుతారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టడం మంచి నిర్ణయమే. కానీ మరో ఇల్లు కోసం లోన్ తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదు. ముందస్తుగా మీరు మీ జీవితాల్లోని ఆర్థిక అవసరాలను, పరిస్థితిని పరిశీలించాలి. హడావుడిగా మరొక లోన్ తీసుకోకండి. మిగిలిన డబ్బుతో తెలివిగా ఇన్వెస్ట్ చేయండి.(ప్రతీకాత్మక చిత్రం)
అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకునేందుకు మీ వద్దతక్కువ డబ్బులున్నా.. లేక అత్యవసర నిధి లేకపోయినా.. మీరు వెంటనే ఆ నిధిని పెంచుకోవడం లేదా ఏర్పరుచుకోవడం చాలా ముఖ్యం. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు సమకూర్చుకోవడం చాలా కష్టం కనుక అన్ని విషయాల కంటే ముందస్తుగా మీరు సరిపడా డబ్బును రెడీగా ఉంచుకోవాలి.(ప్రతీకాత్మక చిత్రం)
ఉదాహరణకు హోం లోన్ కోసం మీరు ప్రతి నెల రూ.50 వేలు కడుతున్నారు అనుకుందాం. ఈ రుణం కట్టడం పూర్తయిన తర్వాత ప్రతి నెల మీ వద్ద రూ.50 వేలు మిగులుతాయి కదా. అప్పుడు మీరు పిల్లల భవిష్యత్తు కోసం రూ.20,000.. పదవీ విరమణ కోసం రూ.30,000 సేవ్ చేయాలి. మరొక లోన్ తీసుకోవడం కంటే ఇలా భవిష్యత్తు కోసం ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.(ప్రతీకాత్మక చిత్రం)
పదవీ విరమణ కోసం, మీరు మీ వీపీఎఫ్/ పీపీఎఫ్(PPF)లలో పెట్టుబడి పెట్టొచ్చు. ఈక్విటీ ఫండ్లను కూడా పెంచుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఈక్విటీ, డెబ్ట్ ఫండ్(debt funds) లలో చిన్న పొదుపు సమీకరణాలు (SIP) ప్రారంభించొచ్చు. లేదావస్తువులు లేదా వాహనాలు కొనుగోలు వంటి షార్ట్ టర్మ్ గోల్స్ను నెరవేర్చుకోవచ్చు.(ప్రతీకాత్మక చిత్రం)