డీజిల్ ధరలు, పెట్రోల్ ధరల తగ్గింపు, డీజిల్ ధరల తగ్గింపు, పెట్రోల్ డీజిల్ లేటెస్ట్ న్యూస్" width="1200" height="800" /> దేశంలో పెట్రోల్, డీజిల్ పై కేంద్రం వసూలు చేస్తోన్న ఎక్సైజ్ టాక్సును తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి శనివారం నాడు ప్రకటించడం తెలిసిందే. లీటరు పెట్రోలుపై రూ.8, లీటరు డీజిల్ పై రూ.6 సుంకాన్ని కేంద్రం తగ్గించడంతో ఆయా రాష్ట్రాల్లో ఆదివారం నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చాయి. మొత్తంగా పెట్రోల్‌పై రూ.9.5, డీజిల్‌పై రూ.7 తగ్గింది. (ప్రతీకాత్మక చిత్రం)
వంటల్లో నూనె ఎక్కువగా వాడే దేశంగా భారత్ తన అవసరాలకు విదేశాల నుంచి పెద్ద ఎత్తున పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ను దిగుమతి చేసుకోవడం తెలిసిందే. సన్ ఫ్లవర్ ఎగుమతిలో అగ్రభాగాన ఉన్న పై యుద్దం కారణంగా గత నాలుగు నెలలుగా సన్ ఫ్లవర్ ధరలు చుర్రుమంటున్నాయి. దీనికితోడు ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించడంతో దాని ధరా పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
అయితే ఇప్పుడు పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం తొలగించడం, ఉక్రెయిన్ నుండి సన్‌ఫ్లవర్ రాక క్రమంగా పెరుగుతుండటంతో భారత్ లో వంట నూనెల సలసల కాస్త తగ్గే అవకాశం ఏర్పడింది. మరో వారం రోజులు, అంటే, జూన్ నుంచే వంట నూనెల ధరలు తగ్గుముఖం పడతాయని మార్కెట్, ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఇండోనేషియా ఏటా 46 మిలియన్ టన్నుల పామాయిల్ ఉత్పత్తి చేస్తుంది. తన ఆహార అవసరాలకు 9 మిలియన్ టన్నులు, బయోడీజిల్ పథకానికి మరో 9 మిలియన్ టన్నులను వినియోగించుకోగా, మిగతా 28 మిలియన్ టన్నులను ఎగుమతి చేస్తోంది. ఏప్రిల్ 28వ తేదీ నుండి పామాయిల్ ఎగుమతులను నిషేధిస్తున్నట్లు ఇండోనేషియా ప్రకటించడంతో భారత్ సహా పలు దేశాల్లో వంట నూనెల ధరలు పెరిగాయి. (ప్రతీకాత్మక చిత్రం)
రష్యా యుద్ధానికి ముందు భారత్ నెలవారీ సన్ ఫ్లవర్ ఆయిల్ వినియోగం 2లక్షల టన్నులుగా ఉండేది. సరఫరా తగ్గడంతో ఇక్కడ వినియోగం కూడా తగ్గింది. ఇప్పుడు ఉక్రెయిన్ నుంచి నూనె సరఫరాలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో నెలకు అదనంగా 20 వేల నుంచి 25వేల టన్నుల మేర సన్ ఫ్లరవ్ ఆయిల్ వస్తుందనే అంచనాలున్నాయి. మొత్తంగా వంటనూనెల ధరలు అదుపులోకి రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)