టాటా టియాగో ఈవీ, టాటా పంచ్ ఈవీ, హరియర్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వంటి కార్డు అన్ని వచ్చే ఏడాది రోడ్లపై పరుగులు పెట్టనున్నాయి. ఎలక్ట్రిక్ కార్లకు నెలకొన్ని డిమాండ్ నేపథ్యంలో కంపెనీలు కూడా వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేశాయి. అందువల్ల వచ్చే ఏడాది మార్కెట్లోకి వచ్చే ఈవీ కార్లు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.
టాటా టియాగో ఈవీ మార్కెట్లోకి రానుంది. టియాగో ఈవీ అనేది అందుబాటు ధరకే లభించనుంది. దీని ధర రూ. 8.49 నుంచి ప్రారంభం అవుతోంది. ఇది రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉండనుంది. 19.2 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ 250 కిలోమీటరల్ ప్రయాణిస్తుంది. అలాగే 24 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ వేరియంట్ అయితే 315 కిలోమీటర్లు వెళ్తుంది. 5.7 సెకన్లలోనే ఈ కార్డు 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ఈ కారు ఇప్పటికే లాంచ్ అయ్యింది. జనవరి నుంచి డెలివరీస్ ప్రారంభం కానున్నాయి. టాప్ వేరియంట్ రేటు రూ. 11.79 లక్షలు. ఇవ్వన్నీ ఎక్స్‌షోరూమ్ రేట్లు.
మహీంద్రా ఎక్స్‌యూవీ 400 జనవరి నెలలో లాంచ్ కానుంది. కంపెనీ దీన్ని ఇప్పటికే రివీల్ చేసింది. ఈ ఎస్‌యూవీలో 39.4 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 456 కిలోమీటర్లు వెళ్లొచ్చు. 50 నిమిషాల్లోనే 80 శాతం వరకు బ్యాటరీ చార్జ్ అవుతుంది. దీని రేటు రూ.15 నుంచి రూ.20 లక్షల వరకు ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.