1. గురువారం నాడు భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా దూసుకెళ్లాయి. ఈ ర్యాలీ దిగ్గజ ఇన్వెస్టర్ అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు (Rakesh Jhunjhunwala) కోట్ల వర్షం కురిపించింది. ఆయన పోర్ట్‌ఫోలియోలోని కేవలం రెండు స్టాక్స్ నుంచే ఆయన సంపద ఏకంగా రూ.861 కోట్లు పెరిగింది. అందులో ఒకటి టైటాన్ కంపెనీ కాగా, ఇంకొకటి స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్. (ప్రతీకాత్మక చిత్రం)
2. గురువారం నాడు టైటాన్ కంపెనీ షేర్ ధర రూ.2587.30 నుంచి రూ.2706 ధరకు చేరుకుంది. ఒక షేర్‌పై ఏకంగా రూ.118.70 పెరిగింది. అలాగే స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ షేర్ ధర రూ.608.80 నుంచి రూ.641 ధరకు పెరిగింది. ఒక షేర్‌పై రూ.32.20 పెరిగింది. ఈ రెండు షేర్లల్లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్మెంట్ రూ.861 కోట్లు పెరగడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
3. టైటాన్ కంపెనీలో ఝున్‌ఝున్‌వాలా షేర్ హోల్డింగ్ చూస్తే 2021 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య ఆయనకు 3,57,10,395 టైటాన్ కంపెనీ షేర్లు ఉన్నాయి. ఈ కంపెనీలో మొత్తం 4.02 షేర్లు ఆయన పేరు మీద ఉన్నాయి. ఇక రేఖా ఝున్‌ఝున్‌వాలా పేరు మీద 95,40,575 షేర్లు అంటే 1.07 శాతం వాటాలున్నాయి. ఇద్దరికీ కలిపి 4,52,50,970 షేర్లు అంటే 5.09 శాతం వాటాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ విషయానికి వస్తే ఈ కంపెనీలో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు 10,07,53,935 షేర్లు ఉన్నాయి. గురువారం నాడు స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఒక షేర్ ధర రూ.32.20 పెరిగింది. ఈ లెక్కన రూ.32.20 x 10,07,53,935 షేర్లకు లెక్కేస్తే ఆయన సంపద రూ.324 కోట్లు పెరిగింది. స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఆయన ఇన్వెస్ట్మెంట్ వ్యాల్యూ చూస్తే రూ.6,458 కోట్లు. (ప్రతీకాత్మక చిత్రం)
7. భారతదేశంలో దిగ్గజ ఇన్వెస్టర్లలో ఒకరైన అయిన రాకేష్ ఝున్‌ఝున్‌వాలా మెట్రో బ్రాండ్స్, నజారా టెక్నాలజీస్, ర్యాలీస్ ఇండియా, అగ్రోటెక్ ఫుడ్స్, జియోజిత్ ఫైనాన్షియల్స్ లాంటి అనేక కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. రాకేష్ ఝున్‌ఝున్‌వాలా పెట్టుబడులకు సంబంధించి ఇచ్చిన ఈ వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. దీన్ని పెట్టుబడికి సలహాగా పరిగణించకూడదు. (ప్రతీకాత్మక చిత్రం)