భారతీయ జనతా ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రతీ ఒక్కరికీ బ్యాంక్ ఖాతా ఉండాలనే ఉద్దేశ్యంతో జన్ ధన్ యోజన ఖాతాలు తెరిపించారు. దానిని ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) అనే పథకాన్ని ప్రారంభించారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఆధార్ కార్డు, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ లాంటివి జిరాక్స్ సమర్పించాలి. అకౌంట్ ఓపెన్ కు ఎలాంటి రుసుము వసూలు చేయరు. ముఖ్య గమనిక ఏంటంటే.. మీరు ఎదైనా బ్యాంక్ కు వెళ్లి అకౌంట్ ఓపెన్ చేసే ముందు అదే బ్యాంక్ లో మరో చోటు ఆధార్ లింక్ చేసిన అకౌంట్ ఉండకూడదు. అలా ఉంటే మీ అకౌంట్ ఓపెన్ కాదని బ్యాంక్ అధికారులు తెలిపారు.
(ప్రతీకాత్మక చిత్రం)
ఒక వేళ ఖాతాదారుడు ప్రమాదానికి గురయితే క్లయిమ్ కోసం క్లెయిమ్ ఫామ్, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగినట్టు ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ కార్డ్ వివరాలు సబ్మిట్ చేయాలి. వీటితో పాటు బ్యాంకు నుంచి డిక్లరేషన్ కూడా కావాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన కొన్ని రోజులకు క్లెయిమ్ సెటిల్ అవుతుంది. ఈ మొత్తం నామినీ కి చెందుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)