ACCORDING TO RBI RULES BANK WILL RESPONSIBLE IF CUSTOMERS LOSE MONEY DUE TO CYBER ATTACK NS
Bank Frauds: మీ తప్పిదం లేకుండానే మీ అకౌంట్ నుంచి డబ్బు పోయిందా? అయితే, మీ బ్యాంకుదే బాధ్యత.. ఈ RBI రూల్స్ తెలుసుకోండి
rbi rules for online fraud: కొన్ని సార్లు బ్యాంకు పొరపాట్లు, వారి బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా కూడా డబ్బు కట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బ్యాంకే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ ఆర్బీఐ రూల్స్ తెలుసుకోండి.
ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్ల దాడులు అధికమవుతున్నాయి. అనేక మంది బ్యాంకు ఖాతాల నుంచి వారికి తెలియకుండానే డబ్బులు మాయమైన వార్తలు ఇటీవల మనం వింటూనే ఉన్నాం.
2/ 6
కొన్ని సార్లు బ్యాంకు పొరపాట్లు, వారి బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాల కారణంగా కూడా డబ్బు కట్ అవుతూ ఉంటుంది. అయితే మీ ప్రమేయం లేకుండా మీ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఖాతా నుంచి నుంచి డబ్బులు మాయమైతే మాత్రం మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
3/ 6
ఎందుకంటే బ్యాంకే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆర్బీఐ సైతం బ్యాంకులకు స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో జాతీయ వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పును RBI ఆమోదించి ఈ మేరకు నిబంధనలు రూపొందించింది.
4/ 6
ఆర్బీఐ రూపొందించిన నిబంధనల ప్రకారం.. బ్యాంకు తప్పిదం కారణంగా కస్టమర్ డబ్బులు కోల్పోతే జరిగే మొత్తం నష్టాన్ని బ్యాంకే భరించాల్సి ఉంటుంది. ఖాతాదారుడి నిర్లక్ష్యం కారణంగా ఎవరైనా మోసానికి పాల్పడితే మాత్రం జరిగే మొత్తం నష్టాన్ని అతడే భరించాలని ఆర్బీఐ తేల్చి చెప్పింది.
5/ 6
ఒక వేళ 7 వర్కింగ్ డేస్ అనంతరం ఫిర్యాదు చేస్తే మాత్రం బ్యాంకు విధానంపై నష్ట పరిహారం ఆధారపడి ఉంటుంది.
6/ 6
ఖాతాదారుల నగదుకు భద్రత కల్పించే విషయంలో బ్యాంకులు పూర్తిగా బాధ్యత వహించాలని రిజర్వు బ్యాంకు, జాతీయ వినియోగదారుల ఫోరం గతంలో అనేక సార్లు స్పష్టం చేశాయి. అదే సమయంలో కస్టమర్లు సైతం బ్యాంకుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి.