అందువల్ల ఈ విషయంలో ప్రజలు తమ పాన్ కార్డును ఆధార్ కార్డ్‌తో ఉచితంగా లింక్ చేసుకోవడానికి సహాయం చేయాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. అన్ని స్థానిక, సబ్ పోస్టాఫీసులకు ఉచిత లింక్ అంశానికి సంబంధించి అధికారం ఇవ్వాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ, రెవెన్యూ శాఖలను ఆదేశించాలని ఆయన అభ్యర్థించారు. అలాగే పాన్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం గడువును వచ్చే ఆరు నెలల వరకు పొడిగించాలని కోరారు.
కాంగ్రెస్ నేత లేఖకు మోదీ సానుకూలముగా స్పందిస్తే.. పాన్ కార్డుకలిగిన వారికి ఊరట లభిస్తుందని చెప్పుకోవచ్చు. కాగా పాన్ కార్డు ఆధార్ కార్డు లింక్ అనుసంధానం 2022 ఏప్రిల్ 1 ముందు వరకు ఉచితంగానే ఉంది. అయితే తర్వాత రూ. 500 ఫీజు తీసుకువచ్చారు. అలాగే అటుపైన 2022 జూలై 1 నుంచి ఆధార్ పాన్ కార్డు లింక్‌కు రూ. 1000 ఫీజును వసూలు చేస్తున్నారు.