Voter ID Aadhaar Card Link: శుభవార్త.. ఆధార్, ఓటర్ కార్డు లింక్ గడువు పొడిగింపు.. కొత్త డెడ్‌లైన్ ఇదే!
Voter ID Aadhaar Card Link: శుభవార్త.. ఆధార్, ఓటర్ కార్డు లింక్ గడువు పొడిగింపు.. కొత్త డెడ్‌లైన్ ఇదే!
Aadhaar Card | మీరు ఓటర్ కార్డు ఉందా? అయితే కేంద్రం తీపికబురు అందించింది. ఆధార్ కార్డుతో పాన్ కార్డు లింక్ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో చాలా మందికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
Voter ID | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా కీలక ప్రకటన చేసింది. ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింక్ గడువు పొడిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంకా ఆధార్ కార్డుతో ఓటర్ కార్డును లింక్ చేసుకోని వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.
2/ 10
ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడానికి 2023 ఏప్రిల్ 1తో గడువు ముగియాల్సి ఉంది. అయితే మోదీ సర్కార్ ఇప్పుడు ఈ గడువును 2024 మార్చి 31 వరకు పొడిగించింది. అంటే మరో ఏడాది పాటు డెడ్‌లైన్‌ను ఎక్స్టెండ్ చేసిందని చెప్పుకోవచ్చు.
3/ 10
ఓటర్ కార్డు కలిగిన వారు ఆన్లైన్లోనే ఈ ఓటర్ ఐడీని ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు. లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా లింక్ చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఇది తప్పనిసరి మాత్రం కాదు. స్వచ్ఛందం ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవచ్చు.
4/ 10
ఎలక్షన్ కమిషన్ ప్రకారం చూస్తే.. ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవడం ద్వారా చాలా బోగస్ ఓట్లను గుర్తించొచ్చు. అంటే ఒకే వ్యక్తికి ఒకటి కన్నా ఎక్కువ చోట్ల ఓటర్ కార్డులు ఉంటే.. అవి రద్దు అవుతాయి. దీని వల్ల పారదర్శకత వస్తుంది.
5/ 10
2021 డిసెంబర్ నెలలో లోక్ సభలో ఎలక్షన్ చట్టం (సవరణ) బిల్లుకు ఆమోదం తెలిపారు. దీని వల్ల ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు లింక్ అనుసంధానం చేసుకునే వెసులుబాటు తీసుకువచ్చారు. ఇప్పుడు మనం ఓటర్ కార్డును ఆధార్ కార్డుతో ఎలా లింక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
6/ 10
ముందుగా ఓటర్ కార్డు కలిగిన వారు నేషనల్ ఓటర్స్ సర్వీస్ పోర్టల్ ఎన్వీఎస్పీ.ఇన్‌లోకి వెళ్లాలి. అక్కడ లాగిన్ అవ్వాలి. లాగిన్ వివరాలు లేకపోతే మీరు అకౌంట్ రిజిస్టర్ చేసుకోవచ్చు. లాగిన్ అయిన తర్వాత సెర్చ్ ఇన్ ఎలక్ట్రోరల్ రోల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
7/ 10
తర్వాత పర్సనల్ డీటైల్స్‌లోకి వెళ్లాలి. అక్కడ మీ ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దీన్ని ఎంటర్ చేయాలి.
8/ 10
మీరు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఓటర్ కార్డు ఆధార్ కార్డుతో అనుసంధానం అవుతుంది. ఇలా మీరు సులభంగానే ఓటర్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు. ఎలక్టర్స్ ఆధార్ డేటా కోసం కొత్తగా ఫామ్ 6బీ తీసుకువచ్చినట్లు ఎలక్షన్ కమిషన్ పేర్కొంటోంది.
9/ 10
ఈసీఐ లేదా సీఈవో వెబ్‌సైట్స్, ఎన్వీఎస్పీ, వీహెచ్ఏ, గరుడ వంటి సైట్లలో కూడా ఫామ్ 6బీ అందుబాటులో ఉంటుంది. ఆన్లైన్లో ఆధార్ కార్డ నెంబర్‌తో ఓటర్ కార్డు లింక్ చేసుకోవాలని భావించే వారు దీన్ని ఉపయోగించుకోవచ్చు.
10/ 10
అదే ఆఫ్‌లైన్‌లో అయితే ఫామ్ 6జీని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి దగ్గరిలోని బూత్ లెవెల్ ఆఫీసర్‌కు అందిస్తే సరిపోతుంది. ఇలా ఓటర్ కార్డుతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవచ్చు.