* ముఖ్యమైన డాక్యుమెంట్ : ప్రతి భారత పౌరుడికి కేంద్ర ప్రభుత్వం 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో ఆధార్‌ను జారీ చేసింది. అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్స్‌లో ఇది ఒకటి. బ్యాంకింగ్ కార్యకలాపాలు మొదలుకొని ఆన్లైన్ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ కార్డ్ చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. ఆధార్‌లో కార్డ్‌హోల్డర్ డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ డేటా ఉంటుంది. ప్రభుత్వం అందించే ప్రయోజనాలను పొందాలంటే ఆధార్ తప్పనిసరిగా ఉండాలి.