* ఎనీడెస్క్ అంటే ఏంటి? : కరోనా తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమల్లోకి రావడంతో AnyDesk అప్లికేషన్ పాపులర్ అయింది. AnyDesk అనేది రిమోట్ డెస్క్‌టాప్ అప్లికేషన్. దీని ద్వారా రిమోట్ లొకేషన్లోని కంప్యూటర్ను యాక్సెస్ చేయవచ్చు. ఉదాహరణకు ఎనీడెస్క్ ద్వారా బెడ్రూమ్ నుంచి ఆఫీస్‌లోని కంప్యూటర్‌కి కనెక్ట్ కావచ్చు.
ఈ అప్లికేషన్ Android, iOS, macOS, Windows, Linux వంటి ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో పని చేస్తుంది. ఎనీడెస్క్ ద్వారా కనెక్ట్ అవుతున్న వ్యక్తులకు యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేయవచ్చు. ఈ అప్లికేషన్ ఉపయోగించడానికి హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. తాజా ఫ్రాడ్ నేపథ్యంలో, ఇలాంటి రిమోట్ యాక్సెస్ యాప్స్ వాడకంపై అవగాహన పెంచుకోవాలని, ఇతరులకు సిస్టమ్ యాక్సెస్‌ను రిస్ట్రిక్ట్ చేయాలని అధికారులు సలహా ఇస్తున్నారు.