లైఫ్ పార్ట్నర్ను కనుగొనడంలో చాలామందికి మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లు (Matrimonial Website) మొదటి ఆప్షన్ అవుతున్నాయి. అయితే జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడానికి మాత్రమే కాదు ఈ వెబ్సైట్లు అంతకు మించి ప్రయోజనాలను సైతం అందిస్తున్నాయి. అందుకు నిదర్శనంగా లేటెస్ట్ లింక్డ్ఇన్ (LinkedIn) పోస్ట్ నిలుస్తోంది.
జీవన్సాతి.కామ్ భారతదేశంలోని మోస్ట్ పాపులర్, ట్రస్టబుల్ మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో ఒకటి. అయితే దీనిని హై-పేయింగ్ జాబ్ సెర్చింగ్ కోసం వాడుతున్నారనే విషయం తెలిసి నెటిజన్లు అవాక్కయ్యారు. "ఇలాంటి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ ఎలా వస్తాయి మీకు," అంటూ వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీవన్సాతి.కామ్‌ను జాబ్ సెర్చింగ్‌లో ఎలా ఉపయోగించాలో వివరించే లింక్డ్ఇన్ పోస్టు కొద్ది గంటల్లోనే వైరల్ అయింది. సోషల్ మీడియాలో దీనికి 30 వేలకు పైగా లైక్‌లు, వందల్లో కామెంట్లు వచ్చాయి.
మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌ను ఇలా వినూత్నంగా ఉపయోగించనే ఆ మహిళ జీనియస్ ఐడియాకి చాలామంది హాట్సాఫ్ చెప్పారు. అన్ని మ్యాట్రిమోనియల్ సర్వీస్‌లు తమ ప్రీమియం సర్వీస్‌లలో చేర్చడానికి శాలరీ ఇన్ఫో ఒక బెస్ట్ ప్రొడక్ట్ ఐడియా అని ఒక నెటిజన్ సూచించారు. మగవారు డేటింగ్ కోసం లింక్డ్‌ఇన్‌ని ఉపయోగిస్తే.. ఉద్యోగ అన్వేషణ కోసం మహిళలు డేటింగ్/మ్యాచ్‌మేకింగ్ వెబ్సైట్లను ఉపయోగిస్తున్నారని పేర్కొంటూ మరొక యూజర్ చమత్కరించారు.
కెరీర్-వైజ్ బెనిఫిట్స్ కోసం మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లను ఉపయోగించడం ఇదే మొదటిసారి కాదు. బెంగుళూరుకు చెందిన స్టార్టప్ సాల్ట్ కో-ఫౌండర్ ఉదితా పాల్ అనే మహిళ, జీవన్సాతి.కామ్‌లో తనకు పరిచయమైన వ్యక్తిని ఉద్యోగంలో నియమించుకోవాలనుకున్నారు. అతనితో మ్యాచ్ అయిన తర్వాత, ఆమె అతని రెజ్యూమ్‌ను కోరారు. అతనికి ఇంటర్వ్యూ లింక్‌ను కూడా పంపారు. ఈ సంఘటన కూడా అప్పట్లో వైరల్ అయ్యింది.
మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లలో ఒక వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, కెరీర్, ఇన్కమ్ గురించి మొత్తం డేటా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ ఆధారంగా వివిధ కంపెనీలు అందించే శాలరీలను తెలుసుకోవడం ఎవరికైనా సాధ్యమవుతుంది. ఇలాంటి పోర్టల్స్ ఉపయోగిస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నందున, వీటిని ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ కోసం ఒక ప్లాట్‌ఫామ్‌గా కూడా కొందరు వాడుతున్నారు.