1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం ఏడో పే కమిషన్ (7th Pay Commission) అమలవుతోంది. ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంటుంది. వేతనాలు, అలవెన్సులు, ఇతర నిర్ణయాలన్నీ ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకే ఉంటాయి. అయితే ఏడో పే కమిషన్ ఇంకో ఏడాది మాత్రమే ఉంటుందని వార్తలొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం ప్రతీ 10 ఏళ్లకోసారి కొత్త పే కమిషన్ను ఏర్పాటు చేస్తుంది. 2014లో ఏడో పే కమిషన్ ఏర్పాటైంది. ఏడో పే కమిషన్ 2024 వరకే కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం అంతలోపే ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఎనిమిదో పే కమిషన్ అమలులోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు పెరగున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)