1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఏడో పే కమిషన్ (7th Pay Commission) సిఫార్సుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏ పెంచింది. పెరిగిన డీఏ 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. మొన్నటి వరకు 31 శాతం డీఏ పొందిన ఉద్యోగులు ఇప్పుడు 34 శాతం డీఏ పొందుతున్నారు. ఏడో పే కమిషన్ పరిధిలోని ఉద్యోగులందరికీ ఈ డీఏ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. మరోవైపు ఐదో పే కమిషన్ (5th Pay Commission) పరిధిలోని ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర స్వయంప్రతిపత్తి గల ఉద్యోగులకు డీఏ 364 శాతం నుంచి 381 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. వీరికి కూడా పెరిగిన డీఏ 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. మరోవైపు ఆరో పే కమిషన్ (6th Pay Commission) పరిధిలోని ఉద్యోగులకు కూడా డీఏ పెంచింది కేంద్ర ప్రభుత్వం. వీరికి డీఏ 196 శాతం నుంచి 203 శాతానికి పెరిగింది. ఉద్యోగులకు డీఏ పెరిగింది కాబట్టి పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ కూడా పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మేలు చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంచడంతో 47.68 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ, 68.62 లక్షల పెన్షనర్లకు డీఆర్ పెరిగింది. అసలే ఇప్పుడు ద్రవ్యోల్బణం కారణంగా ఖర్చులు పెరిగిపోయాయి. పాలు, కూరగాయలు, ఆహాద పదార్థాలు, మెడిసిన్, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. డీఏ, డీఆర్ పెరగడం ఉద్యోగులకు, పెన్షనర్లకు ఊరట కలిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉద్యోగులకు బేసిక్ పే పైన డీఏ పెరుగుతుందన్న విషయం గుర్తుంచుకోవాలి. డీఏ క్యాలిక్యులేట్ చేసే సమయంలో ఇతర అలవెన్సుల్ని పరిగణలోకి తీసుకోకూడదు. కేవలం బేసిక్ పే మాత్రమే లెక్కించాలి. గతంలో 31 శాతం డీఏ వచ్చేది. ఇప్పుడు 34 శాతం డీఏ వస్తుంది. అంటే బేసిక్ పే పైన 3 శాతం డీఏ అదనంగా వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండు సార్లు డీఏ పెంచుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డీఆర్ పెరుగుతుంది. ప్రతీ ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏ, డీఆర్ పెరుగుతుంది. అయితే పలు కారణాల వల్ల ప్రభుత్వం ఆలస్యంగా డీఏ పెంపును ప్రకటిస్తుంది. డీఏ పెంచిన తర్వాత డీఏ బకాయిల్ని రిలీజ్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)