1. కొత్త సంవత్సరం 2022లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మోదీ ప్రభుత్వం బహుమతులతో ముంచెత్తనున్నట్లు తెలుస్తోంది. కొద్ది వారాల క్రితమే కేంద్రం డీఏ (DA), డీఆర్ (DR), టీఏ (TA), హెచ్ఆర్ఏ (HRA)లను పెంచింది. అయితే నూతన సంవత్సరం సందర్భంగా మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 31 శాతం డియర్నెస్ అలవెన్స్‌ను పొందుతున్నారు. జులై, అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని రెండుసార్లు పెంచిన విషయం తెలిసిందే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు డియర్నెస్ అలవెన్స్‌ను మరోసారి 3 శాతం పెంచితే వారి జీతం గణనీయంగా పెరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కొత్త సంవత్సరం 2022లో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగవచ్చు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాలు మరోసారి పెరగనున్నాయి. అన్ని ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో జీతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కాస్త ఆర్థిక భారం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)