1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. ఉద్యోగులకు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) బకాయిలు పెండింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సి ఉంది. చాలాకాలంగా ఈ బకాయిల కోసం ఉద్యోగులు ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలోనే డీఏ, డీఆర్ బకాయిలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 18 నెలల బకాయిల్ని విడతలవారీగా కాకుండా ఒకేసారి జమ చేసే అవకాశాలు ఉన్నాయి. 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 60 లక్షల మంది పెన్షనర్లకు బకాయిలు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారి కారణంగా 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు డీఏ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డీఏ రీస్టోర్ చేయడంతో పాటు 2021 జూలై డీఏ కూడా పెంచింది కేంద్ర ప్రభుత్వం. అయితే 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు డీఏ, డీఆర్ బకాయిల్ని మాత్రం విడుదల చేయలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని బట్టి డీఏ లెక్కిస్తారు. ఈ లెక్కన రావాల్సిన డీఏ బకాయిల వివరాలు చూస్తే లెవెల్ 1 ఉద్యోగులకు రూ.11,880 నుంచి రూ.37,554 మధ్య, లెవెల్ 13 ఉద్యోగులకు రూ.1,23,100 నుంచి రూ.2,15,900 మధ్య జమకావాల్సి ఉంది. ఇక లెవెల్ 14 ఉద్యోగులకు రూ.1,44,200 నుంచి రూ.2,18,200 మధ్య డీఏ బకాయిలు విడుదల కావాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. అంటే రూ.11,880 నుంచి రూ.2,18,200 వరకు రావాల్సిన డీఏ బకాయిల్ని ఒకేసారి విడుదల చేయనుంది కేంద్ర ప్రభుత్వం. దీనిపై వచ్చేవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022 జనవరి డీఏ కూడా ప్రకటించాల్సి ఉంది. డీఏ పెంపుపైనా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఉద్యోగులకు ప్రస్తుతం 31 శాతం డీఏ లభిస్తోంది. 2022 జనవరికి సంబంధించిన డీఏ 3 శాతం పెరుగుతుందని అంచనా. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటాను పరిగణలోకి డీఏ 3 శాతం లేదా 4 శాతం పెంచొచ్చు. ఈ లెక్కన ఉద్యోగులు 34 లేదా 35 శాతం డీఏ అందుకోనున్నారు. ఉద్యోగులకు డీఏ పెరిగితే హెచ్ఆర్ఏ కూడా పెరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)