1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం (Central Government) ఏ నిర్ణయం తీసుకున్నా ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లపై ప్రభావం చూపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. అందులో డీఏ పెంపు, హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్, ఫిట్మెంట్ ఫ్యాక్టర్ లాంటి అనేక అంశాలు ఉంటాయి. అయితే ఉద్యోగులు కొంతకాలంగా కొన్ని డిమాండ్ చేస్తున్నారు. వాటిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రధానంగా ఎదురుచూస్తున్న 5 శుభవార్తల గురించి తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Fitment Factor: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదీ ఉద్యోగుల వేతనానికి సంబంధించినన అంశం. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్. (ప్రతీకాత్మక చిత్రం)
6. House Building Advance: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హౌజ్ బిల్డింగ్ అలవెన్స్ విషయంలోనూ ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు 2023 మార్చి 31 వరకే వర్తిస్తుంది. ఆ తర్వాత వడ్డీ రేటు పెరగనుందని వార్తలొస్తున్నాయి. వడ్డీ రేటు స్థిరంగా కొనసాగించినా ఉద్యోగులకు లాభమే. (ప్రతీకాత్మక చిత్రం)
7. 8th Pay Commission: ఏడో పే కమిషన్ 2014లో అమలులోకి వచ్చింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ 10 ఏళ్లకోసారి పే కమిషన్ రూల్స్ మారుతుంటాయి. అంటే ఏడో పే కమిషన్ 2024 వరకే ఉంటుందని అంచనా. అయితే కేంద్ర ప్రభుత్వం ఏడో పే కమిషన్‌ను ఎనిమిదో పే కమిషన్‌తో రీప్లేస్ చేస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)