7TH PAY COMMISSION NEWS CENTRAL GOVERNMENT SAVED RS 34402 CRORE BY FREEZING DA AND DR OF EMPLOYEES AND PENSIONERS SS
7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిలు ఎంతంటే
7th Pay Commission News | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ రీస్టోర్ అయిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది డీఏ నిలిపివేసినప్పటి నుంచి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ బకాయిలు రావాల్సి ఉంది. మరి ఆ మొత్తం ఎంతో తెలుసా? తెలుసుకోండి.
1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ అంటే డీఏ అమలులోకి వచ్చింది. 2021 జూలై 1 నుంచి పెరిగిన డీఏ ప్రకారమే వేతనాలు వస్తున్నాయి. డీఏ పెరగడం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు డీఏ పెరగడంతో పెన్షనర్లకు డియర్నెస్ రిలీఫ్ అంటే డీఆర్ కూడా పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 6
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి 1 నుంచి డీఏ పెండింగ్‌లో ఉంది. గతేడాది కరోనా వైరస్ మహమ్మారి కారణంగా డీఏ నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం. డీఏ, డీఆర్ రీస్టోర్ చేసినా 2020 జనవరి నుంచి మూడు వాయిదాల్లో రావాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు అలాగే ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 6
3. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ, డీఆర్ నిలిపివేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఎంత ఆదా అయిందో తెలుసా? రూ.34,402 కోట్లు. అవును. రూ.34 వేల కోట్లకు పైనే డీఏ, డీఆర్ బకాయిలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 6
4. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు తెలిపారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల కాలంలో 1.14 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ నిలిపివేయడం ద్వారా రూ.34,402 కోట్లు ఆదా అయినట్టు వివరించారు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 6
5. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభం కారణంగా కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ ఫ్రీజ్ చేసినట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. నిధులు సమకూర్చుకోవడానికి పార్లమెంట్ సభ్యులు, మంత్రుల వేతనాల్లో కోత విధించడంతో పాటు పలు నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 6
6. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతంగా ఉన్న డీఏ 28 శాతానికి పెరిగింది. మూడు వాయిదాలకు సంబంధించి 11 శాతం డీఏ పెరిగింది. కానీ డీఏ బకాయిలు మాత్రం ఇంకా చెల్లించలేదు. (ప్రతీకాత్మక చిత్రం)