1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వబోతుందన్న వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 25న కేంద్ర కేబినెట్ సమావేశం కాబోతోంది. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. కొత్త ఏడాదిలో డీఏ బకాయిలు విడుదలయ్యే అవకాశాలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు కేంద్ర ప్రభుత్వం డీఏ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డీఏ రీస్టోర్ చేసిన 18 నెలల డీఏ బకాయిలు ఉద్యోగులకు రావాల్సి ఉంది. దీనిపై డిసెంబర్ 25న కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా కేంద్ర ప్రభుత్వం 2020 జనవరిలో పెంచాల్సిన డీఏను నిలిపివేసింది. ఆ తర్వాత 2020 జూలై, 2021 జనవరి డీఏను కూడా పెంచలేదు. కొంతకాలం క్రితం మూడు డీఏలను కూడా రీస్టోర్ చేసింది. 2020 జనవరిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ ఉంటే 2020 జూలై డీఏ 4 శాతం, 2021 జనవరి డీఏ 3 శాతం, 2021 జూలై డీఏ 4 శాతం కలిపి ఒకేసారి 11 శాతం డీఏ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం ఒకే సెటిల్మెంట్లో 18 నెలల బకాయిల్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. డిసెంబర్ 25న జరగబోయే సమావేశంలో కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకటించనుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. జనవరిలో ఒకసారి, జూలైలో మరోసారి డీఏను పెంచుతూ ఉంటుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రావాల్సిన డీఏ, డీఆర్ బకాయిలు ఎంతో తెలుసా? రూ.34,402 కోట్లు. ఆగస్టులో ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రకటించారు. 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల కాలంలో 1.14 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన డీఏ, డీఆర్ మొత్తం రూ.34,402 కోట్లు ఒకేసారి విడుదల కానుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచడానికి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-AICPI డేటాను పరిగణలోకి తీసుకుంటుంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-AICPI డేటా ప్రకటించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీఏ ప్రకటిస్తుంది. AICPI 130 పాయింట్స్ ఉంటే డీఏ 4 శాతం, 130 పాయింట్స్ కన్నా తక్కువ ఉంటే డీఏ 3 శాతం పెరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)