1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు కీలకమైన నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఎప్పుడు ప్రకటిస్తుందా అని చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు. అందులో ఒకటి డీఏ పెంపు (DA Hike) కాగా, మరొకటి ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెంపు. ఇక మూడోది డీఏ బకాయిల విడుదల. వీటిపై కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో నిర్ణయం తీసుకోనుందన్న వార్తలు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతీ ఏటా రెండు సార్లు డియర్నెస్ అలవెన్స్, రియర్నెస్ రిలీఫ్ పెరుగుతుంది. జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి డీఏ, డీఆర్ పెరుగుతుంది. 2023 జనవరి డీఏ పెంపు కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రకటన వస్తుందనుకున్నా కేంద్ర ప్రభుత్వం ఇంకా డీఏ పెంచలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంచితే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 18 నెలల డీఏ బకాయిలు రావాల్సి ఉంది. కరోనా వైరస్ మహమ్మారి సందర్భంగా డీఏ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత డీఏ రీస్టోర్ చేసినా బకాయిలు చెల్లించలేదు. ఆ బకాయిలపైనా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందని భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చాలా కాలంగా ఫిట్మెంట్ పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇదీ వారి వేతనానికి సంబంధించినదే. 2023 మార్చిలోనే ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను రివైజ్ చేయొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 శాతంగా ఉంది. ఈ ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అలవెన్స్ విషయంలోనూ ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ లభిస్తోంది. 2023 మార్చి 31 తర్వాత ఈ వడ్డీ రేటు పెరగవచ్చని భావిస్తున్నారు. వడ్డీ రేటు పెరిగితే ఉద్యోగులపై భారం తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)