1. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు జులై 1 నుంచి పెరిగిన డియర్నెస్ అలవెన్స్ (డీఏ) పొందుతున్నారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. పెన్షనర్లు సైతం ఆ ప్రకారమే డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) అందుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే డియర్నెస్ అలవెన్స్‌ను 17 నుంచి 28 శాతానికి పెంచింది. అయితే ఇప్పుడు డీఏను మరోసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. దీపావళికి ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డీఏను అదనంగా పెంచనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే మొత్తం డీఏ 31 శాతానికి చేరుకోనుంది. ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్‌ను మూడు శాతం అదనంగా పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా డేటా ప్రకారం AICPI ఇండెక్స్ (కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్) 121.7 కి చేరుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. దీని ప్రకారం 2021 జూన్ డీఏను 3 శాతం పెంచాల్సి ఉంది. 2021 జూన్ ఇండెక్స్ 1.1 పాయింట్లు పెరిగి 121.7కి చేరుకుంది. దీని ప్రకారం డియర్నెస్ అలవెన్స్ 31.18 శాతంగా ఉండాలి. కానీ డీఏ లెక్కింపును రౌండ్ ఫిగర్‌కు సమం చేస్తారు. జూన్‌కు సంబంధించి డియర్నెస్ అలవెన్స్ 3 శాతం పెరిగితే, మొత్తం డీఏ 31 శాతంగా మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)