1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం ఇటీవల డీఏ పెంచిన సంగతి తెలిసిందే. 2020 జనవరి నుంచి పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ఒకేసారి పెంచింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఏకంగా 11 శాతం డీఏ పెరిగింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 17 శాతం డీఏ మాత్రమే వచ్చేది. 2020 జనవరి డీఏ 4 శాతం, 2020 జూలై డీఏ 3 శాతం, 2021 జనవరి డీఏ 3 శాతం పెండింగ్లో ఉండేది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఈ మూడు డీఏలను పెంచుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మూడు డీఏలు ఒకేసారి పెరగడంతో 17 శాతంగా ఉన్న డీఏ ఏకంగా 28 శాతానికి పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, పెన్షనర్లకు పెన్షన్ భారీగా పెరిగింది. అయితే ఆ మూడు డీఏల బకాయిలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు కేంద్ర ప్రభుత్వం. (ప్రతీకాత్మక చిత్రం)
4. 2021 జనవరి డీఏను ఇప్పటికే పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2021 జూలై డీఏ ప్రకటించాల్సి ఉంది. ఈ డీఏను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుందని భావిస్తున్నారు ఉద్యోగులు. 2021 జూలై డీఏ మూడు శాతం ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్-AICPI నివేదికను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏను నిర్ణయిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. AICPI డేటా ప్రకారం ఇండెక్స్ 121.7 పాయింట్స్ పెరిగింది. ఈ లెక్కన ఉద్యోగులకు 3 శాతం డీఏ పెరుగుతుందని అంచనా. కేంద్ర ప్రభుత్వం 3 శాతం డీఏను పెంచితే ఉద్యోగులకు మొత్తం 31 శాతం డీఏ లభిస్తుంది. దసరా, దీపావళి పండుగల్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్లోనే డీఏ పెంపును ప్రకటించే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)