1. సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 3 శాతం లేదా 4 శాతం డియర్నెస్ అలవెన్స్ పెరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా జనవరిలో ఓసారి, జూలైలో మరోసారి కలిపి ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది. ఈ ఏడాది జూలైలో డీఏ పెరగనుంది. ఈసారి ఉద్యోగులకు, పెన్షనర్లకు 5 శాతం డీఏ, డీఆర్ పెరగనుందన్న వార్తలు వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. కేంద్ర ప్రభుత్వం ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ డేటాను (AICPI) పరిగణలోకి తీసుకొని ఉద్యోగులకు ఎంత శాతం డీఏ పెంచాలో నిర్ణయిస్తుంది. ఈ డేటా ప్రకారం ప్రతీసారి ఏటా 3 శాతం లేదా 4 శాతం మాత్రమే డీఏ పెరుగుతుంది. చివరిసారిగా 3 శాతం డీఏ పెంచింది. దీంతో 31 శాతంగా ఉన్న డీఏ 34 శాతానికి పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. లేటెస్ట్ AICPI డేటాను బట్టి ఉద్యోగులకు ఈసారి 5 శాతం డీఏ పెరగనుందని అంచనా. AICPI డేటాను పరిశీలిస్తే జనవరిలో 125.1 పాయింట్స్, ఫిబ్రవరిలో 125 పాయింట్స్, మార్చిలో 126 పాయింట్స్ ఏప్రిల్లో 127.7 పాయింట్స్ ఉంది. ద్రవ్యోల్బణం కారణంగా AICPI డేటా పెరుగుతూ వస్తోంది. ఫలితంగా ఉద్యోగులకు డీఏ కూడా అదనంగా ఇవ్వాల్సి రావొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం 5 శాతం డీఏ పెంచితే ఉద్యోగులకు అది శుభవార్తే. ఉద్యోగులకు 39 శాతం డీఏ లభించనుంది. ఉద్యోగులకు డీఏ పెరిగితే పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది. జూలై 1న డీఏ పెంపుపై ప్రకటన రావొచ్చని భావిస్తున్నారు ఉద్యోగులు. ప్రతీ సారి డీఏ పెంపు కాస్త ఆలస్యంగా జరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం 4 శాతం డీఏ పెంచితే రూ.56,900 బేసిక్ వేతనం ఉన్నవారికి 38 శాతం డీఏ చొప్పున రూ.22191 డీఏ లభిస్తుంది. ప్రస్తుతం 34 శాతం చొప్పున రూ.19,346 డీఏ లభిస్తుంది. 5 శాతం డీఏ పెరిగితే అదనంగా రూ.2,845 వేతనం లభించనుంది. ఉద్యోగులకు వార్షికంగా రూ.34,140 ప్రయోజనం లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపుపై నిర్ణయం తీసుకుంటే 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది. జూలై 1న డీఏ పెంపుపై ప్రకటన వస్తుందేమోనని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఉద్యోగులు, పెన్షనర్లు. మరోవైపు ఉద్యోగులకు 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు 18 నెలల డీఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)