3. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ సందర్భంగా డీఏ పెంపుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఉద్యోగులకు నిరాశ తప్పలేదు. మార్చి 8న హోళీ పండుగ ఉంది. కాబట్టి హోళీ కానుకగా డీఏ పెంచవచ్చని తాజాగా వార్తలొస్తున్నాయి. మార్చి 1న కేంద్ర కేబినెట్ భేటీ జరగనుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చన్నది తాజాగా వస్తున్న వార్తల సారాంశం. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఈసారి డీఏ ఎంత పెరుగుతుందన్న చర్చ కూడా ఉద్యోగుల్లో జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 38 శాతం డీఏ లభిస్తోంది. 2023 డీఏ 4 శాతం పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఉద్యోగులకు 42 శాతం డీఏ లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంచితే 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరుగుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అలవెన్స్ విషయంలోనూ ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ లభిస్తోంది. 2023 మార్చి 31 తర్వాత ఈ వడ్డీ రేటు పెరగవచ్చని భావిస్తున్నారు. వడ్డీ రేటు పెరిగితే ఉద్యోగులపై భారం తప్పదు. (ప్రతీకాత్మక చిత్రం)