1. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర బడ్జెట్‌పై (Union Budget 2023-24) అనేక అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను లిమిట్ పెంచుతుందని, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తుందని సామాన్యుల నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇదే బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు కీలక ప్రకటనలు కూడా ఉంటాయని వార్తలు వస్తున్నాయి. అందులో ఒక ప్రకటన ఊరట కల్పిస్తే, మరో ప్రకటన వారి జేబుకు కాస్త భారాన్ని తగ్గించేందని ఆ వార్తల సారాంశం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకుఫిట్మెంట్ ఫ్యాక్టర్ ద్వారా వేతన సవరణ జరిగే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఉద్యోగుల వేతన సవరణ కోసం ప్రభుత్వం కొత్త ఫార్ములాను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం 8వ పే కమిషన్ ఏర్పాటు చేయడానికి మరో సంవత్సరం మాత్రమే ఉంది. కేంద్ర ప్రభుత్వం త్వరలో 8వ పే కమిషన్ ఏర్పాటు చేస్తుందని గతేడాది పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలు అవాస్తవమని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఖండించింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ లభిస్తోంది. ఈ వడ్డీ రేటు 2023 మార్చి 31 వరకు అమలులో ఉంటుంది. మార్చి 31 తర్వాత ఈ వడ్డీ రేటు పెరుగుతుందని వార్తలొచ్చాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఇదే వడ్డీ రేటును మరో ఏడాది కొనసాగిస్తుందా అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. హెచ్‌బీఏ పొందేందుకు కనీసం 10 ఏళ్ల నిరంతర సర్వీసు అవసరం. అయితే దీన్ని 5 ఏళ్లకు తగ్గించాలని కమిషన్ గతంలో సిఫార్సు చేసింది. ఒకవేళ భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే, ఇద్దరికీ విడివిడిగా HBA అనుమతించబడాలని కూడా సిఫార్సు చేసింది. వీటిపై బడ్జెట్లో సానుకూల ప్రకటనలు రావొచ్చని ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతీ ఏటా జనవరి, జూలైలో డీఏ పెరుగుతుందన్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు 2023 జనవరికి సంబంధించిన డీఏ పెంపు ప్రకటన రావాల్సి ఉంది. డీఏ 3 శాతం పెంచే అవకాశాలున్నాయి. ప్రస్తుతం 38 శాతం డీఏ లభిస్తోంది. 3 శాతం డీఏ పెరిగితే ఉద్యోగులకు 41 శాతం డీఏ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)