1. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 2022 డీఏ, డీఆర్ పెరగాల్సి ఉంది. దీంతో పాటు 2020 జనవరి నుంచి 2021 జూన్ వరకు డీఏ, డీఆర్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కొత్త డీఏ ఎప్పుడు ప్రకటిస్తారని, డీఏ బకాయిలు (DA Arrears) ఎప్పుడు విడుదల చేస్తారని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు (Omicron cases) పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం డీఏ పెంపును నిలిపివేసినట్టు ఉత్తర్వులు ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండీచర్ ఈ ఉత్తర్వులు జారీ చేసినట్టు అందులో కనిపిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఈ ఉత్తర్వులు నకిలీవని కేంద్ర ప్రభుత్వానికి చెందిన PIB Fact Check స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్నెస్ అలవెన్స్, డియర్నెస్ రిలీఫ్ నిలిపివేసినట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పేరుతో ఫేక్ ఆర్డర్ సర్క్యులేట్ అవుతోందని, ఈ ఉత్తర్వులను నమ్మొద్దని సూచిస్తోంది. (image: PIB Fact Check)
4. కేంద్ర ప్రభుత్వం 2020 లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన సమయంలో డీఏ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒకసారి కాదు 2020 జనవరి, 2020 జూలై, 2021 జనవరి డీఏలను నిలిపివేసింది కేంద్ర ప్రభుత్వం గతేడాది జూలై తర్వాత మూడు డీఏలను ఒకేసారి రీస్టోర్ చేసింది. అయితే గతంలో డీఏ, డీఆర్ నిలిపివేయడం, ఇప్పుడు ఈ ఉత్తర్వులు రావడంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో అయోమయం నెలకొంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. మరోవైపు కేంద్ర ప్రభుత్వం 2022 జనవరికి సంబంధించిన డీఏ పెంచేందుకు కసరత్తు చేస్తోంది. ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు ఈసారి 3 శాతం డీఏ పెంచొచ్చని అంచనా. ప్రస్తుతం ఉద్యోగులకు 31 శాతం డీఏ లభిస్తోంది. కేంద్ర ప్రభుత్వం మరో 3 శాతం డీఏ పెంచితే ఉద్యోగులు, పెన్షనర్లు 34 శాతం డీఏ, డీఆర్ పొందుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు 18 నెలల డీఏ, డీఆర్ బకాయిలు రావాల్సి ఉంది. ఈ మొత్తం రూ.34,402 కోట్లు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. అదే జరిగితే 1.14 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఎదురుచూపులు ఫలించినట్టవుతుంది. ఉద్యోగుల బేసిక్ వేతనాన్ని బట్టి లెక్కేస్తే గరిష్టంగా రూ.2,18,200 వరకు డీఏ బకాయిలు రానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)