1. కోటికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు డియర్నెస్ అలవెన్స్ (Dearness Allowance), డియర్నెస్ రిలీఫ్ (Dearness Relief) పెంపు కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యోగులకు డీఏ పెంపుపై (DA Hike) కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే నిర్ణయం తీసుకుంటారన్న వార్తలు చాలా రోజులుగా వస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. మార్చి 16న జరగబోయే కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) డీఏ, డీఆర్ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏటా రెండుసార్లు డీఏ పెంచుతుంది. ప్రతీ ఏటా జనవరి, జూలై నెలల్లో డీఏ పెరుగుతుంది. ఉద్యోగులకు డీఏ పెరిగినప్పుడల్లా పెన్షనర్లకు డీఆర్ కూడా పెరుగుతుంది. 2022 జనవరికి సంబంధించిన డీఏ, డీఆర్ పెరగాల్సి ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. డీఏ, డీఆర్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం హోళీ కన్నా ముందే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మార్చి 18న హోళీ పండుగ ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశం మార్చి 16న జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆరోజున డీఏ పెంపుపై నిర్ణయం తీసుకోవచ్చని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం మార్చి నెల కాబట్టి ఇప్పటికే ఉద్యోగులకు రెండు నెలల వేతనం వచ్చేసింది. (ప్రతీకాత్మక చిత్రం)
5. అంతకుముందు పెండింగ్లో ఉన్న మూడు డీఏలు కలిపి ఒకేసారి 11 శాతం డీఏ పెంచింది కేంద్ర ప్రభుత్వం. అక్టోబర్ 2021లో మరో 3 శాతం డీఏ పెంచింది. దీంతో డీఏ 31 శాతానికి పెరిగింది. జనవరి డీఏ 3 శాతం పెరిగితే 34 శాతం డీఏ లభించనుంది. 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 65 లక్షల మంది పెన్షనర్లకు మేలు జరగనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI) డేటాను పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏను పెంచుతూ ఉంటుంది. ఈ డేటా ప్రకారం 3 లేదా 4 శాతం డీఏ పెరగొచ్చు. ఈసారి 3 శాతం డీఏ పెంచుతారని అంచనా. డీఏ 34 శాతానికి పెరిగితే రూ.18,000 బేసిక్ వేతనం ఉన్నవారికి రూ.73,440 వార్షిక డీఏ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. గరిష్టంగా వార్షికంగా రూ.2,32,152 డీఏ లభించే అవకాశం ఉంది. బేసిక్ వేతనాన్ని బట్టి డీఏ లెక్కిస్తారు కాబట్టి బేసిక్ వేతనం ఎక్కువ ఉన్నవారికి ఎక్కువ డీఏ లభిస్తుంది. పెరిగే ద్రవ్యోల్బణాన్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీఏ, డీఆర్ పెంచుతూ ఉంటుంది. చివరిసారిగా అక్టోబర్లో 2021 జూలైకి సంబంధించిన డీఏ పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)